Thursday, 30 July 2026 10:31:01 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గజమాలతో అపూర్వ స్వాగతం పలికిన పుట్టపర్తి తెదేపా శ్రేణులు....

Date : 19 September 2022 11:45 PM Views : 1058

ఆంధ్రప్రదేశ్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి కి విచ్చేసిన మాజీ మంత్రి, పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, 68వ జన్మదిన వేడుకలను తెదేపా శ్రేణులు అత్యంత ఘనంగా నిర్వహించారు. అడుగడుగునా మాజీ మంత్రి కి పూల వర్షం. తెదేపా అభిమానుల్లో ఉప్పొంగిన ఉత్సాహం.తడిసి ముద్దాయిన పల్లె భావోద్వేగాలకు లోనైన మాజీ మంత్రి. ఎన్ని జన్మలెత్తినా ఈ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనిది. ప్రాణం ఉన్నంతకాలం ఈ ప్రజలకు సేవ చేస్తా.మీ వల్లనే నాకు ఇంతటి గౌరవం. శిరస్సు వంచి పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనం. మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి భావోద్వేగాల మధ్య కొనసాగిన ప్రసంగం మీ ప్రేమ ,అభిమానం ,ఆప్యాయత ,అనురాగం,మమకారం నాపై ఉన్నంతవరకు ఈ గడ్డ ప్రజలకు నా ప్రాణం ఉన్నంతకాలం సేవ చేస్తానని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు .మీ ప్రేమానురాగాలతో మీరు చూపిన ఆదరాభిమానాలతో నాకు రాజకీయంగా అన్ని మంచి పదవులు దక్కాయంటే ఈ పుట్టపర్తి నియోజకవర్గ ప్రజల చలువే అన్నారు. మీ వల్లనే నాకు ఇంతటి గౌరవం లభించిందని అందుకు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ,శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నా అని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఎంతో భావోద్వేగం తో కార్యకర్తల నుద్దేశించి మాట్లాడారు. నా సతీమణి పల్లె ఉమా ఈరోజు బతికి ఉండి ఉంటే ఈ జన్మదిన వేడుకలను, ఈ ప్రజలు చూపిన అభిమానాన్ని చూసి ఎంతో సంతోషించేదని ఎంతో భావోద్వేగం తో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ ప్రాంత ప్రజలకు , నాకు ,నా కుటుంబానికి ఆమె లేనిలోటు పూడ్చలేనిదన్నారు. నా జీవిత భాగస్వామి పల్లె ఉమా లేని లోటుతో నాకు ఎంతో బాధ గా ఉన్నప్పటికీ ఈ పుట్టపర్తి నియోజకవర్గ ప్రజల ప్రేమా అనురాగాలను పంచి ఇచ్చిన ఆ దేవుడికి ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటానని పేర్కొన్నారు. నా ప్రాణం ఉన్నంతకాలం ఈ గడ్డ ప్రజలకు సేవ చేస్తానని వారి రుణం తీర్చుకోలేనిదని పేర్కొన్నారు. పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి 68వ జన్మదిన వేడుకలను ఆదివారం తెదేపా శ్రేణులు అత్యంత ఘనంగా నిర్వహించారు . పుట్టపర్తి కి విచ్చేసిన మాజీ మంత్రికి డప్పు వాయిద్యాలతో ఆంజనేయస్వామి సర్కిల్ వద్ద టిడిపి రాష్ట్ర నాయకుడు సామకోటి ఆదినారాయణ , టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ పల్లె అభిమాని బేకరీ నాయుడు ఆధ్వర్యంలో వేరువేరుగా భారీ క్రేన్ తో ఏర్పాటుచేసిన గజమాలలతో భారీగా తరలివచ్చిన తెదేపా శ్రేణుల మధ్య పల్లె కు అపూర్వ స్వాగతం పలికారు. నియోజకవర్గం నుంచి భారీగా తరలివచ్చిన టిడిపి కార్యకర్తల తో పుట్టపర్తి జిల్లా కేంద్రం పూర్తిగా జన సంద్రంగా మారింది. ఎంతో కోలాహాలంగా ప్రజల మధ్యన నిర్వహించిన మాజీ మంత్రి పల్లె జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు . అభిమానులు చూపించిన ఆదరాభిమానాలతో అడుగడుగునా తమ అభిమాన నాయకుడికి పూల వర్షం కురిపిస్తూ ప్రజలు ఆశీర్వదించారు. ఎక్కడ చూసినా మాజీ మంత్రికి అపూర్వ స్వాగతం పలుకుతూ ప్రజలు నీరాజనాలు పలికారు. ప్రతి చోట ఆయనకు పూలవర్షం కురిపించడం తో ఆ పూలవర్షంలో పల్లె రఘునాథ్ రెడ్డి తడిసి ముద్దయ్యారు. భారీ జనసమూహం మధ్య సాగిన ఈ జన్మదిన వేడుకలతో పుట్టపర్తి నియోజకవర్గ తెదేపా శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది. కొత్తచెరువులో, పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎదుట టిడిపి అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేశారు. పుట్టపర్తి మున్సిపాలిటీలో నియోజకవర్గ ఐటీడీపీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పల్లె పేరుతో ఏర్పాటుచేసిన కేక్ ను కట్ చేశారు. మాజీ మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఆరు మండలాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ,అభిమానులు భారీగా పుట్టపర్తికి తరలివచ్చారు. వారికి టీడీపీ కార్యాలయంలో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :