ఆంధ్రప్రదేశ్ / శ్రీ సత్యసాయి జిల్లా : జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్, సాధారణ తనిఖీలో భాగంగా, రొద్దo పోలీస్ స్టేషన్ ని తనిఖీ చేశారు... * పోలీస్ స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టర్, వివిధ క్రైమ్ రికార్డ్స్ లను పరిశీలించాడు. పోలీస్ స్టేషన్ పరిసరాలను, స్టేషన్ లో సీజ్ చేయబడిన వాహనాలను, లాకప్ గదులను మరియు కంప్యూటర్ గదిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పాత నేరస్తులపై మరియు రౌడీ షీటర్ల పై నిఘా ఉంచాలని సమస్యత్మక గ్రామాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని, దేవాలయాలలో జరిగే చోరీలను అరికట్టాలని, చోరీలు జరగడానికి అవకాశం ఉన్న ప్రాంతాలలో నిఘా పెంచి, చోరీలకు అడ్డుకట్ట వేయాలని తెలియజేశారు. బీట్స్ బాగా పెంచి స్టేషన్ పరిధిలో జరిగే రెగ్యులర్ క్రైమ్ పై ప్రత్యేక దృష్టి సారించి వాటి పూర్తిస్థాయి నియంత్రణ చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. నాటు సారా తయారీ మరియు అసాంఘిక కార్యకలాపాలు, నిర్వహిస్తున్న వ్యక్తుల గురించి పోలీసులకు తెలియజేసిన వారికి తగిన నజరానా ఇచ్చి,వారి యొక్క వ్యక్తిగత విషయాలు గోప్యంగా ఉంచబడతాయని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. స్టేషన్ పరిది లోని జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో నిఘా ఉంచాలని తెలియజేశారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునితో మర్యాదగా వ్యవహరిస్తూ, వారి యొక్క చట్టపరమైన సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని తెలియజేశారు. పోలీస్ సిబ్బంది యొక్క సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, అలాగే ఎవరైనా బాధ్యత రాహితంగా వ్యవహరిస్తున్నట్లయితే, వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడ బోమని సిబ్బందికి తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ గారితో పాటు ఈ రోజు పెనుకొండ sdpo గా బాధ్యతలు తీసుకున్న హుస్సేన్ పీరా గారు రొద్దమ్ S I ఎం. నాగస్వామి మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు...
-----------------------
Admin