సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాక తాళ్లగుమ్మూరు నందు రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింల పవిత్ర స్థలమైన ఈగ్గాలో ఏర్పాటు చేసిన ప్రార్థనలలో పాల్గొన్న భద్రాచల శాసనసభ్యులు పొదెం వీరయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లిం సోదరులు ప్రజల ప్రశాంతత కోసం ఇన్ని రోజులు ఉపవాసాలతో చేసిన ప్రార్థనలు అల్లా దీవెనలతో ప్రజలకు సకల శుభాలు కలగాలని కోరుతున్నట్లు అయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు మహబూబ్ అలీ, పినపాక నియోజకవర్గ నాయకులు బట్ట విజయ గాంధీ, కనితి కృష్ణ, బూర్గంపాడు మండల అధ్యక్షులు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి, మాజీ మండల అధ్యక్షులు బెల్లంకొండ వాసు, సారపాక పట్టణ అధ్యక్షులు యల్లంకి రామకృష్ణ, మహబూబ్ ఖాన్, రహమాన్ షరీఫ్, గద్దల వీరయ్య, ముస్లిమ్స్ మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin