సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం నుండి ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారిపై కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జి వద్ద రోడ్డు నిర్మాణంలో నాసిరకం మట్టి వాడుతూ నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని వేపలగడ్డ గ్రామస్తులు ప్రధాన రహదారిపై ఆందోళన చేశారు... ప్రభుత్వం నుండి కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని రోడ్ల అభివృద్ధి కోసం కేటాయిస్తే ఎమ్మెస్సార్ కాంట్రాక్టర్ అధికారులు కలిసి తాము ఇష్టానుసారంగా పనులను నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికంగా దొరికే సింగభూపాలెం చెరువులో మట్టిని తమ సొంత లారీలలో తీసుకువచ్చి రోడ్డు నిర్మాణ పనులకు వాడుతున్నారు మంచి గ్రావెల్ ఎర్ర మట్టి వాడాల్సి ఉండగా చెరువు లో ఉన్న నల్ల మట్టి తో కూడిన తడి మట్టి పోయడంతో రోడ్డంత బురద గుంతల మయంగా దర్శనమిస్తుంది పది కాలాలపాటు పదిలంగా ఉండాల్సిన రోడ్డుకు ఇలాంటి నాణ్యత లేని మట్టి వాడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాంట్రాక్టర్ మాత్రం కోట్ల రూపాయలు దండుకొని రోడ్డు నిర్మాణం గాలికి వదిలేసాడు అని అధికారులు రాజకీయ నాయకులు ప్రశ్నించకపోవడంతో అంతర్యం ఏమిటి అని వాహనదారులు చర్చించుకుంటున్నారు రైల్వే బ్రిడ్జి నిర్మాణం చేపట్టి సుమారు మూడు సంవత్సరాలు గడుస్తున్నా బ్రిడ్జి నిర్మాణ పనులు ముందుకు సాగపోవడంతో వాహనదారులు రోడ్ల వెంట దుమ్ము దూళితో కళ్ళలో పడి ప్రమాదాలు జరిగిన సంఘటనలో ఉన్నాయి వేసవికాలం ఎండలు మండుతున్న రోడ్డు నిర్మాణానికి రోడ్ల వెంట మట్టి పోషినప్పుడు నీళ్లు చల్లకపోవడంతో దుమ్ము మట్టి రేణువులు కళ్ళలో పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు చుట్టు ప్రక్కల గ్రామస్తులు ఇళ్లల్లోకి మట్టి రావడంతో ఇంట్లోని సామాగ్రి పైన దుమ్ము ధూళి పడుతుందని అధికారులకు ప్రజాప్రతినిధులకు తెలిపిన ఎక్కడా పట్టించుకోవడంలేదని గ్రామస్తుల ఆరోపిస్తున్నారు పనులు దక్కించుకున్నది రాజకీయ నాయకులు అధికారులు అండదండలు ఉన్న బడా కాంట్రాక్టర్ కావడంతో తనుష్టారాజంగా వ్యవహరిస్తున్నాడని మండలంలో జోరుగా చర్చ జరుగుతుంది వేపల గడ్డ గ్రామస్తులు ఏకమై ప్రధాన రహదారిపై పనులు జరుగుతున్న చోట కాంట్రాక్టర్ కు సంబంధించిన మట్టి లారీలను మిషనరీని పనులను నిలిపివేశారు విషయం తెలుసుకున్న ఆర్ అండ్ బి డి ఈ నాగేశ్వరరావు స్థానిక ఎస్సై పండుగ తిరుపతిరావు సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులకు నచ్చజెప్పి ఆందోళన విరమించాలని తెలిపారు పోసిన నాసిరకం చెరువు మట్టిని తీసివేసి మంచి మట్టి పోయిస్తామని దుమ్ముదులి లేకుండా ఎప్పటికప్పుడు రోడ్డుపై నీళ్లు పోయి ఇస్తామని హామీ ఇచ్చారు ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టించుకోని నిత్యం ప్రజలు ప్రయాణించే ప్రధాన రహదారి నిర్మాణ పనులను నాణ్యత తో మంచి మట్టిని వాడేలా చూడాలని సుజాతనగర్ మండల ప్రజలు కోరుతున్నారు....
-----------------------
Admin