Friday, 31 July 2026 03:35:27 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పాఠశాలకు ప్రొజెక్టర్ అందించిన గ్రామ అభ్యుదయ కమిటీ...

Date : 25 October 2023 02:24 AM Views : 273

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు : మండల పరిధిలోని బొత్తలపాలెం గ్రామానికి చెందిన అభ్యుదయ కమిటీ తన ఉదారతను చాటుకుంది. గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల లోని డిజిటల్ క్లాసుల బోధనకు అవసరమైన, ప్రొజెక్టర్ ను అందజేశారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల కోరిక మేరకు 30 వేల రూపాయల ఖర్చుతో ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు కమిటీ తెలిపింది. గతంలో విద్యార్థులకు ప్రైవేటు ట్యూషన్, క్లాస్ రూమ్ బెంచిల బహుకరణ, స్టడీ మెటీరియల్ తదితర సహకారం అందించారు. కొందరు పూర్వ విద్యార్థులు ఆర్థిక సహకారంతో పాఠశాల ప్రాంగణంలో కళావేదికను ఏర్పాటు చేశారు. గ్రామంలో ఈ మధ్యకాలంలో రైల్వే,పోలీస్ శాఖల్లో ఉద్యోగాలు సాధించిన కుటుంబాలను సన్మానించారు. గ్రామానికి చెందిన వృత్తిరీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తులు కొంతకాలం క్రితం అభ్యుదయ కమిటీగా ఏర్పడ్డారు. దసరా, సంక్రాంతి పండుగలకు బతుకమ్మ ఉత్సవాలు, ల్ముగ్గుల పోటీలను కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తూ బహుమతులు ప్రధానం చేస్తున్నారు. అంతేకాదు గ్రామంలో గత ఎన్నికల సమయంలో నోటుకు ఓటును అమ్ముకోకూడదు అని ప్లకార్డులు పట్టుకొని వీధి వీధి తిరుగుతూ ప్రదర్శననిచ్చారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వివరిస్తూ గ్రామంలోని, ప్రజలకు నిరక్షరాశులకు అవగాహన కల్పించారు. ప్రజాసేవకు ప్రాధాన్యతనిచ్చే మంచి వ్యక్తులను ఓటు అనే ఆయుధం ద్వారా ఎన్నుకోవాలని సూచించారు. తమ కమిటీ అభ్యుదయంగా ఉంటూ గ్రామ పెద్దలు, ప్రజల సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేస్తామని, చైతన్యవంతమైన గ్రామంగా అభివృద్ధి చేయడానికి తమ వంతు సామాజిక బాధ్యతను నిర్వహిస్తామని వారు స్పష్టం చేశారు. వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న కమిటీని గ్రామస్తులు అభినందించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: