సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ పట్టణం లోని ఇండోర్ స్టేడియం (మినీ స్టేడియం) లో నిర్వహిస్తున్న ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ నియోజకవర్గ క్రికెట్ టోర్నమెంట్ ను ఎంపీపీ రవి యాదవ్ లంచానంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...100 టీములతో ఈ రోజు క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైనందుకు చాలా సంతోషంగా ఉందని గతంలో ఇక్కడ చాలా చిన్న గ్రౌండ్ ఉండేదని ఎమ్మెల్యే గారి సహకారం తో ఇంత పెద్ద గ్రౌండ్ ను నిర్మించినందుకు చాలా సంతోషంగా ఉంది. షాద్ నగర్ నియోజకవర్గంలో చాలా మంది క్రీడాకారులు ఉన్నారని వారిని ప్రోత్సహిస్తే వారు ముందుకు వెలుతారని అలాగే క్రీడాకారులకు మంచి మంచి ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. క్రీడాకారులకు ఎంకరేజ్ మెంట్ చేయాలని అన్నారు. ఇంత పెద్ద టోర్నమెంట్ నిర్వహించడం చాలా మంచి విషయమని అలాగే స్కూల్ పిల్లలు కూడా ఈ స్టేడియం ను వినియోగించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ స్టేడియం కాంపౌండ్ వాల్ కొరకు ఎమ్మెల్యే పది లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. ఈరోజు మన నియోజకవర్గం నుండి జిల్లా స్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు ఎంతోమంది క్రీడాకారులు తయారయ్యారని అన్నారు. తెలంగాణ లో హైదరాబాదు నుండి భారతదేశంలో టీం లో ఒకప్పుడు అజారుద్దీన్, శివాలాల్ యాదవ్, ఇప్పుడు సిరాజ్ లాంటి క్రీడాకారులు ఈరోజు మన ఇండియాకు పేరు తెచ్చారని అని అన్నారు. ఈ టోర్నమెంట్ లో మొత్తము సుమారు ఒక లక్ష యాభై వేల రూపాయలు క్యాష్ బహుమతిగా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. విన్నర్ టీం కు 50 వేలు, రన్నర్ టీం కు 30 వేలు, అలాగే బెస్ట్ బ్యాట్స్ మాన్, బెస్ట్ బౌలర్, బెస్ట్ ఫిల్టర్, బెస్ట్ కీపర్ లకు క్యాష్, బహుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్బంగా టోర్నమెంట్ నిర్వాహకులు నాయకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కేశంపేట ఎంపీపీ రవీందర్ యాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, రైతు సంఘం అధ్యక్షుడు వెంకటరెడ్డి, గ్రంథాలయం చైర్మన్ నర్సింహా రెడ్డి, కౌన్సిలర్లు చెట్ల నరసింహ పావని, జిటి శ్రీనివాస్, యుగంధర్, జూపల్లి శంకర్, నందిగామ శ్రీను, క్రికెట్ కు సంబంధించిన షాద్ నగర్ 11 క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ ఎండి. కబీర్, వైస్ ప్రెసిడెంట్ ఏజాస్ ఆర్గనైజర్ ఫరీద్, మేనేజ్మెంట్ మున్నా, మతీన్, కేశవ్, లక్ష్మణ్, శివ, మధు, సాయి, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin