సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం లో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం లో భాగంగా ఎర్రగొండపాలెం పట్టణంలో ఇజ్రాయిల్ పేటలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పాల్గొన్న టిడిపి ఇన్చార్జి గూడూరి ఏ రీక్షన్ బాబు ఈ సందర్భంగా ఏరిక్షన్ బాబు మాట్లాడుతూ. ఈరోజు ఒకరోజు ముందుగానే కూటమి ప్రభుత్వము ప్రజల ఇబ్బందులను గమనించిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేయడం జరిగిందని ఆయన అన్నారు. నియోజకవర్గంలో దాదాపు 10 గంటల లోపే 90 శాతం వితంతువులకు, వృద్ధులకు, వికలాంగులకు వివిధ రకాల పెన్షన్లను పంపిణీ చేశామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీపీ శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, టిడిపి కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు...
-----------------------
Admin