Thursday, 30 July 2026 12:36:13 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ....

Date : 20 October 2023 07:36 AM Views : 484

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ : ఎన్నికల నిర్వహణ బందోబస్తు ఏర్పాట్లులోభాగంగా హుజూర్నగర్ నందు పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని, పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపిఎస్ సందర్శించారు. బందోబస్తు నిర్వహణకు సంబంధించి హుజూర్ నగర్ సర్కిల్ కార్యాలయం నందు సమీక్ష నిర్వహించారు. సర్కిల్ పరిధిలో గల పోలీస్ స్టేషన్ల లో హుజూర్ నగర్ , మఠంపల్లి, గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకవీడు ఆయా మండలాల్లో గల సమస్యాత్మక గ్రామాల గురించి, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల గురించి సమీక్షించారు. గ్రామాల్లో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలని సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న వ్యక్తులను ముందస్తుగా బైండోవర్ చేయాలని కోరారు. సమస్యాత్మక గ్రామాలను సందర్శిస్తూ ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణ నెలకొల్పడానికి యువత ఆదర్శంగా ఉండాలని ఎస్పీ కోరారు. ఎన్నికల కేసులలో చిక్కుకున్నట్లయితే వారి వ్యక్తిగత వివరాలను పోలీస్ రికార్డ్స్ లో నమోదు చేయడం జరుగుతుందని రౌడీషీటర్, సస్పెక్ట్ షీటర్స్ గా ముద్ర వేయాల్సి వస్తుందని ఎస్పీ హెచ్చరించారు. ఎవరు కూడా గొడవలకు తగాదాలకు వెళ్లకుండా సమరస్యంగా ఉండాలని ఎన్నికల నియమావలికి లోబడి నడుచుకోవాలని కోరారు. గ్రామాల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా పోలీస్ శాఖ అప్రమత్తంగా పనిచేస్తుందని తెలిపారు.ఈనెల 31వ తేదీన హుజూర్నగర్ పట్టణంలో సీఎం కెసిఆర్ పర్యటన సందర్భంగా రామస్వామి గట్టు రోడ్డులో సభాస్థలం పరిశీలించి రక్షణ ఏర్పాట్లను చేయాలని సూచించారు.పారామిలిటరీ సిబ్బంది కోసం వసతి పరిశీలించిన ఎస్పీ ఎన్నికల్లో జిల్లాలో బందొస్తు నిర్వహణ కోసం జిల్లా రానున్న పారా మిలిటరీ సిబ్బంది కోసం హుజూర్ నగర్ నందు ఏర్పాటు చేసిన వసతి ఏర్పాట్లను పరిశీలించారు. షాదిఖానా, వాసవి భవన్, టౌన్ హాల్ లను పరిశీలించారు. సిబ్బందికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. ఎస్పీ వెంట సర్కిల్ ఇన్స్పెక్టర్ రామలింగ రెడ్డి, కోదాడ రూరల్ సీఐ రామకృష్ణా రెడ్డి ఉన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :