Saturday, 01 August 2026 01:21:14 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మహాజన్ సంపర్క్ అభియాన్ బిజెపి కన్వీనర్... డాక్టర్ టి. విజయ్ కుమార్ ఆధ్వర్యంలో...

Date : 23 June 2023 12:32 AM Views : 474

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / తొమ్మిదేండ్ల మోడీ పాలనలో సాధించిన విజయాలపై ప్రజలకు వివరించి బీజేపీ వైపు ఆకర్షితులను చేసేలా కార్యాచరణ రూపొందించుకుందనీ షాద్ నగర్ బిజెపి నేతలు అన్నారు. బిజెపి కన్వీనర్ డాక్టర్ టి. విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ‘మహాజన్ సంపర్క్ అభియాన్’ కార్యక్రమాన్ని షాద్ నగర్ పట్టణంలోని లక్ష్మీనరసింహ కాలనీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి బిజెపి నేత ఏపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 9 ఏళ్ల పాలనలో సేవా సుపరిపాలన పేదల సంక్షేమ కోసం మోడీ ప్రభుత్వం కృషి చేసిందని అన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా 80 కోట్ల మందికి ఉచిత రేషన్ పంపిణీ జరిగిందని ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా మూడు కోట్ల పేద కుటుంబాలకు పక్కా ఇల్లు కట్టించామని పేర్కొన్నారు. 11.8 కోట్ల గృహాలకు మరియు 100% గృహాలకు విద్యుత్ సౌకర్యం కల్పించామని పేర్కొన్నారు. 48.3 కోట్ల జన్ధన్ ఖాతాలను తెరిపించి బ్యాంకింగ్ వ్యవస్థలో పేదలను అనుసంధానం చేసినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో విద్యాసంస్థలలో ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10% రిజర్వేషన్లు అమలు చేశామని ప్రధానమంత్రి ఆవాస యోజన ద్వారా 34 లక్షల మంది వీధి వ్యాపారులకు రుణాల పంపిణీ చేశామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా 12 కోట్ల మంది రైతులకు ఏడాదికి 6 వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నట్టు తెలిపారు. ఫసల్ బీమా యోజన ద్వారా 37.5 కోట్ల మంది రైతులు నమోదు చేసుకున్నారని చెప్పారు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా నాలుగు కోట్ల రైతులకు లక్షల కోట్ల క్రెడిట్ ఇచ్చినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ్ కుమార్ పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, మనోహర్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, రిషికేష్, నర్సింలు, మురళి, సాయిబాబా, నవీన్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :