సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : మండల కేంద్రమైన వాజేడు లో మీసేవ సెంటర్స్ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నాయి కానీ మారుమూల ప్రాంత ప్రజల సౌకర్యార్థం పేరూరులో మీసేవ సెంటర్ ఏర్పాటు చేయడంతో పేరూరు పరిసర ప్రాంత ప్రజలు దూరప్రాంతాలకు మండల కేంద్రానికి వెళ్లే దుస్థితి తప్పిందని ఎంతో సంతోషపడ్డారు కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉంటూ పేరూరు పరిసరపాలతో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆన్లైన్ సేవలు విస్తృతంగా అందిస్తుంది అనుకుంటే ప్రజలకు సేవ చేయకపోగా వారంలో ఎప్పుడో ఒకసారి నెలలు అడపాదడపా మీసేవ సెంటర్ పనిచేస్తూ ఉండడంతో ప్రజలలొ అసహనం వ్యక్తం అవుతుంది పేరూరు మీసేవ సెంటర్ నడిపిస్తున్న ఆపరేటర్ తన సొంత పనులలో నిమగ్నమై ఎప్పుడో గాని మీసేవ సెంటర్ తెరవకపోవడంతో ప్రజల అవసరాలు తీరకపోగా కూలీనాలి ప్రజలు వందలు వెచ్చిస్తూ మండల కేంద్రానికి ఆన్లైన్ సేవల కోసం పరుగులు పెట్టాల్సిన అవసరం తీసుకువచ్చాడు ప్రజల నుండి ఆరోపణలు ఆ నోట ఈ నోట వర్కింగ్ జర్నలిస్టుల వరకు వెళ్లడంతో గత 15 రోజులకు ముందు వర్కింగ్ జర్నలిస్టుల బృందం మండల తాసిల్దార్ శ్రీనివాసునువివరణ కోరగా మీసేవ సెంటర్ ఆపరేటర్ ని పిలిపించి అడుగుతాను అన్నారు మరో ప్రశ్నగా జర్నలిస్టుల బృందం ధర్మవరం గ్రామానికి మంజూరైన మీసేవను పేరూరు లో నడిపిస్తున్నారు అన్న ప్రశ్నకు తాసిల్దార్ డేటా తమ దగ్గర లేదని జవాబు ఇచ్చారు జర్నలిస్టులు అడిగిన తర్వాత కూడా 15 రోజులు గడుస్తున్నా పేరూరు మీసేవ సెంటర్ కడప నడుస్తుండడంతో పేరూరు పరిసర ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు డిగ్రీలు చదువుకొని ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న యువతకు ఉపాధి కల్పిస్తూ మీసేవ సెంటర్ ని అశ్రద్ధ చేస్తున్న ఆపరేటర్ని తొలగించి ప్రజలకు అందుబాటులో ఉండి ఆన్లైన్ సేవలు విరివిగా అందించే వ్యక్తికి బాధ్యతలు అప్పజెప్పాలని పేరూరు పరిసర ప్రాంత ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు
-----------------------
Admin