సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : లక్ష్మీపురం లో ఇంటింటా ప్రచార 0 ప్రజల్లో కన్నం ఆలిమ చిరంజీవి లకు మారుమోగిన మద్దతు. సర్కార్ న్యూస్ దుగ్గొండి అభివృద్ధి సేవలే తన లక్ష్యం… ఉంగారం గుర్తు విజయం దిశగా అడుగులు బలంగా. లక్ష్మీపురంసర్పంచ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కన్నం ఆలిమ చిరంజీవి ప్రచారం. వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రంలోని లక్ష్మీపురం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి కన్నం నీలిమ ఉంగారం గుర్తుకు భారీ మద్దతు పొందుతున్నారు. ప్రజల అభివృద్ధి, గ్రామ సమస్యల పరిష్కారం లక్ష్యంగా తీసుకొని ఆయన ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు. లక్ష్మీపురం గ్రామంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థికి తమ పూర్తి మద్దతు ప్రకటించారు. గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలు వినడం, పరిష్కారాలు చెప్పడం, అభివృద్ధి అజెండాను వివరించడం కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రచార సందర్భంగా ఆలిమ మాట్లాడుతూ లక్ష్మీపురం గ్రామంలోని ప్రతి వాడకు, ప్రతి కుటుంబానికి అభివృద్ధి చేరేలా కృషి చేస్తాను. శుద్ధి నీరు, మంచి రోడ్లు, అభివృద్ధి, వీధి లైట్లు, డ్రైనేజ్ వంటి ప్రాథమిక సౌకర్యాల మెరుగుదల నా ప్రాధాన్యం. మీ ఒక్కో ఓటు మా గ్రామానికి దిశా నిర్దేశం అవుతుంది. ఉంగారం గుర్తుకు ఓటేసి నన్ను సర్పంచ్‌గా గెలిపించండి అని ప్రజలను కోరారు. గ్రామ పెద్దలు మాట్లాడుతూ లక్ష్మీపురం గతంలో గ్రామానికి చేసిన సేవలు, అందరితో కలిసిపోయే స్వభావం, ప్రజల సమస్యలకు వెంటనే స్పందించే తీరు తమకు నమ్మకాన్ని ఇస్తున్నాయని తెలిపారు. యువకులు ప్రచార యాత్రలో నినాదాలు చేస్తూ ప్రజల్లో అద్భుతమైన ఉత్సాహాన్ని నింపారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని, ఆలిమ చిరంజీవి తమ గ్రామానికి అవసరమైన నాయకుడని అభిప్రాయపడ్డారు. లక్ష్మీపురం గ్రామంలోని ప్రతి వీధిలో అభ్యర్థి ప్రచారానికి ప్రజలు హర్షాతిరేకంతో స్వాగతం పలికారు.
-----------------------
Reporter