సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : రూ.2వేల నోట్లను రద్దు చేస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంపై టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, షాద్ నగర్ నేత వీర్లపల్లి శంకర్ స్పందించారు.... శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఉపయోగంలేని రూ.2 వేల నోటు ఎందుకు తెచ్చారు... ఎందుకు రద్దు చేస్తున్నారని ప్రశ్నించారు. 2 వేల నోట్ల రద్దు దేశ అభివృద్ధిని అడ్డుకోవడమే అని అన్నారు. పెట్టుబడిదారుల రహస్య అజెండాలో భాగమే రద్దు అని విమర్శించారు. రూ.2 వేల నోట్ల రద్దు చర్య మోడీ ప్రభుత్వ తిరోగమన చర్య అని వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దు ఎందుకు చేశారో తెలియదని.. ఎంత నల్లధనం వెలికితీశారో తెలియదన్నారు. దేశ పరిపాలన ప్రజల కోసం కాకుండా కొంత మంది వ్యక్తుల కోసమే అని అన్నారు. మోడీ మత విశ్వాసాలు కాకుండా ప్రజలను పేదరికంలో ఉంచాలని ఫ్యూడల్ ఆలోచనలో భాగంగానే నోట్ల రద్దు అని శంకర్ మండిపడ్డారు. నోట్ల ఉపసంహరణతో లాభం ఉంటే ఎందుకు ప్రచారం చేయడం లేదని ప్రశ్నించారు. రేషన్ దుకాణంలో ఫోటో లేకుంటే గగ్గోలు పెట్టిన ఆర్ధిక మంత్రి ఎందుకు రద్దుపై ప్రచారం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పతనానికి, రద్దు అంతర్గతంగా దాగి ఉన్న రహస్య ఏజండా ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభంజనం మొదలైందని.. ఢిల్లీ వరకు ఇదే ప్రభంజనం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల వరకు దేశ వ్యాప్తంగా ఇంకా బలోపేతమవుతామని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో అని కేంద్రం పునాదులు కదులుతున్నాయని ఈ కుట్రలో భాగంగానే 2000 నోట్లు రద్దు చేశారంటూ శంకర్ పేర్కొన్నారు. బ్లాక్ మనీని కనుగొనే బాధ్యత ప్రభుత్వానిదని అందులో విఫలమై సామాన్య ప్రజలను ఎందుకు ఇబ్బంది గురి చేస్తున్నారని శంకర్ ప్రశ్నించారు.
-----------------------
Admin