Thursday, 30 July 2026 01:33:16 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

20వ తేదిన పాల్వంచ మున్నూరు కాపు వనభోజనాలు...

Date : 18 November 2022 11:47 PM Views : 469

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ పట్టణ,మండల మున్నూరు కాపు, అనుబంధ కులాల కార్తీక మాస వనభోజనాల కార్యక్రమాన్ని 20వ తేదీ ఆదివారం నాడు స్థానిక ఆడమ్స్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణం నందు నిర్వహించనున్నట్లు ఆహ్వాన కమిటీ సభ్యులు తెలిపారు. ఈరోజు స్థానిక ఆడమ్స్ కాలేజీ నందు కమిటీ సభ్యుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంపెల్లి కనకేష్ పటేల్, చింత నాగరాజు, నూకల రంగారావు లు పాల్వంచ పట్టణ,మండల మున్నూరు కాపు, అనుబంద కులాల కార్తీకమాస వనభోజనాలను స్థానిక కిన్నెరసాని రోడ్ లోని ఆడమ్స్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణం నందు ఏర్పాటు చేశామని ఈ యొక్క కార్యక్రమానికి పాల్వంచ పట్టణ మండల పరిధిలోని సుమారు 5000 మందికి పైగా హాజరు కానున్నారని వారందరికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని, ఈయొక్క వనభోజన కార్యక్రమంలో కల్చరల్ ప్రోగ్రామ్స్, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి డూప్ కళాకారులతో ప్రదర్శనలు, మహిళలకు, పిల్లలకు ఆటల పోటీలు, అతిధులకు సన్మానాలు లాంటి కార్యక్రమాలతో ఆహ్లాదకర వాతావరణంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించబడుతుందని, ఈ కార్యక్రమానికి పాల్వంచ పట్టణ, మండల మున్నూరు కాపు అనుబంధకులాల సోదర, సోదరీమణులందరూ కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ సభ్యలు మిర్యాల కమలాకర్, ఆకుల ఆనంద్, మద్దుల వీర మోహన్ రావు, బేతంశెట్టి విజయ్, సమ్మెట అప్పారావు, గోవాడ రవి, మేడిశెట్టి సాంబశివరావు, తోట ప్రవీణ్ పటేల్, బాలినేని వీరయ్య తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :