సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : వైరా లో విద్యుత్ ఏసీడీ చార్జీలను వెంటనే రద్దు చేయాలని సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వైరా లోని స్థానిక డీఈ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు మాట్లాడుతూ 2023 నుంచి క్యాటగిరి-1 మీటర్లకు గతంలో లేనివిధంగా అదనంగా ఏసీడీ చార్జీలను వసూలు చేస్తూ పేద, మధ్య తరగతి ప్రజలపై ప్రభుత్వం అధిక భారాన్ని మోపుతోందన్నారు. రాష్ట్రంలో తిరిగి దీపాలు పెట్టుకునే పరిస్థితి దాపురించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 24 గంటల పాటు నిరంతరాయంగా కరెంటు ఇస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం అదనపు ఛార్జీలతో సామన్యుల నడ్డి విరస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ఏసీడీ చార్జీలను ఉన్న ఫలంగా రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం) జిల్లా కమిటీ సభ్యులు, వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్, నాయకులు బొడపట్ల రవీందర్, మచ్చామణి, పైడిపల్లి సాంబశివరావు, కొంగర సుధాకర్, మల్లంపాటి ప్రసాదరావు, పాపగంటి రాంబాబు, ఓర్సు సీతారాములు, తోట కృష్ణవేణి, యనమద్ది రామకృష్ణ, వడ్లమూడి మధు, వాసిరెడ్డి విద్యాసాగర్ రావు, పల్లెబోయిన కృష్ణ, ఇమ్మడి సుధీర్, కిన్నెర మోతి తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin