సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఎంపీపీ మూడవత్ పార్వతి కొండ నాయక్ , మరియు ఎం.ఈ.ఓ ఛత్రు నాయక్, ఎంపీడీవో జానకి రాములుతో కలిసి జాతీయ బాలికా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా జనవరి 24 వ తారీఖున జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటాం ప్రధానంగా దేశంలో బాలికలు ఎదుర్కొంటున్న అసమానతలపై మాట్లాడటం, ఆడపిల్లల హక్కులపై అవగాహన కల్పించడం, బాలిక విద్య, ఆరోగ్యం, పోషకాహారం, ప్రాముఖ్యత గురించి చర్చించడం, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడం లాంటి ప్రధాన లక్ష్యాలుగా జాతీయ బాలిక దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మన దేశంలో తొలిసారిగా జాతీయ బాలిక దినోత్సవం జనవరి 24 2008న జరుపుకున్నారు. జనవరి 24 1966న ఇందిరాగాంధీ భారత దేశ తొలి మహిళా ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. దీనికి చిహ్నంగానే మహిళా సాధికారత లింగ సమానత్వాన్ని ప్రో జాతీయ బాలిక దినోత్సవం మహిళా- శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. లింగ అసమానతతో పోరాడుతున్న సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సవాలను గుర్తించడంలో ఇది కీలకమైన అడుగు ఆ తర్వాత క్షీణిస్తున్న పిల్లల లింగ నిష్పత్తి ఇమేజ్ సమస్యను పరిష్కరించడం లక్ష్యంగా 2015లో బేటి బచావో, బేటి పడావో అనే పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు.నేటి బాలికల కళ ఏమిటంటే?...ప్రతి అమ్మాయికి ఆమె నేపథ్యం లేదా పరిస్థితి తో సంబంధం లేకుండా ,ఆరోగ్య సంరక్షణ, విద్యా, ఉద్యోగ రంగాల్లో సమాన అవకాశాలు ఉండాలి. బాలికలకు సాధికారత కల్పించాలి. తద్వారా సమాజానికి ఎంతో మేలు ఈ ఆశయంతోనే ప్రభుత్వ రంగ సంస్థలు సామాజిక సంస్థలు ,జాతీయ బాలిక దినోత్సవం జరుపుకుంటారు .సురక్షితమైన వాతావరణంలో స్వేచ్ఛగా హాయిగా ఎదిగే అవకాశాలు ,ఎలాంటి హింస, వివక్ష వేధింపులు లేని సమాజమే నేటి ఆడపిల్లల కల. ఈ కళ పండే రోజు త్వరలోనే రావాలని ,ఆశల రెక్కలు విప్పుకొని ,మన ఆడబిడ్డలు హాయిగా ఎగరాలని అందరం కోరుకుందాం. మహిళలకు అవకాశాలు ఇవ్వాలేగాని కుటుంబం, సమాజం, సంస్థల్ని , చివరికి దేశాలను కూడా విజయవంతంగా నడిపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు ఆడపిల్లల్ని పుట్టనిద్దాం ,బతకనిద్దాం ,ఎదగనిద్దాం, చదవనిద్దాం!! ఇదే ప్రతి పౌరుడిని పౌరుడిని నినాదం కావాలి. మన జీవితాలకు అర్థం.. పరమార్థం.. శాంతి.. శ్రేయస్సు తోపాటు ఎనలేని ప్రేమను అందించే బంగారు తల్లులు మన ఆడబిడ్డలు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మంజుల, డాక్టర్లు సుధాకర్, నాగేందర్, ఏఎన్ఎంలు,ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin