సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, రాష్ట్ర నాయకులు ఊకంటి.గోపాలరావు అన్నారు. కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ విద్యాశాఖలో 15 సంవత్సరాలుగా పని చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను పర్మనెంట్ చేయాలన్నారు. ఉద్యోగులకు రూ.10లక్షల జీవిత బీమాతో పాటు 5లక్షల ఆరోగ్య బీమాను ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చిమట.నాగేశ్వరావు,గౌస్ బాయ్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin