సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి సందర్భంగా తెలంగాణ లంబాడి హక్కుల పోరాట సమితి సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15న హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న బంజారా భవన్ లో ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించుచున్నాము . మఠంపల్లి మండల ఎంఆర్ఓ కార్యాలయంలో ఎమ్మార్వో ఎల్, మంగ గారికి, శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఆహ్వాన పత్రిక అందజేసినాము తెలంగాణ లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు మాలోతు నాగు నాయక్ ఆధ్వర్యంలో ఈనెల 15న జరిగే సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి భోగ్ బండారో కార్యక్రమానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మరియు భారీ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీమతి ధనసరి సీతక్క కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లాలో ఉన్న గిరిజన ప్రజా ప్రతినిధులు గిరిజన ఉద్యోగస్తులు నాయకులు మేధావులు ప్రజాసంఘ నాయకులు మహిళలు యువకులు కళాకారులు ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయగలరని మనవి. ఇట్టి కార్యక్రమంలో మాలోతు రవీందర్ నాయక్ బానోతు పాండు నాయక్ ధరావత్ గోవిందా నాయక్ సోదాసోత్ పాండు నాయక్ బానోతు చెత్త నాయక్ సాగర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin