సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : బీసీల ఐక్యమత్యంతోనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని రంగారెడ్డి జిల్లా బీసీ సమాజ్ అధ్యక్షుడు దొంతుల సురేష్ అన్నారు. తెలంగాణ బిసి రాష్ట్ర అధ్యక్షుడు సూర్యారావు ఆదేశానుసారం షాద్ నగర్ పట్టణ కేంద్రంలో బీసీ సమాజ్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు దొంతుల సురేష్ కుమార్, బిసి కుల సంఘాలు అధ్యక్షులు మేదరి సంఘము కోన దేవయ్య, తాలుకా ముదిరాజ్ అధ్యక్షులు అంచ రాములు, నాయీబ్రాహ్మణ సంఘము అధ్యక్షులు రోమియో రమేష్, యాదవ్ సంఘము జిల్లా ఉపాధ్యక్షులు పద్మారామ్ వెంకటేష్ యాదవ్ మిగతా బిసి కుల సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఎర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.... బిజేపీ ప్రభుత్వం సూర్యాపేట సభలో బీసీలను ముఖ్యమంత్రిని చేస్తానని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించడం హర్షం వ్యక్తం చేశారు. బీహార్ రాష్ట్రంలో జరిగిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో కుల గణన చేయాలని బిసి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఆర్ధిక వనరులు సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు సమానంగా అందాలంటే కుల గణన జరగాలన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ భారత ప్రధానమంత్రి చేయని విధంగా బీసీ కమిషన్ నరేంద్ర మోడీ రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటు చేయడం దేశానికే గర్వకారణం అన్నారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఏవి కూడా బీసీల గురించి ఆలోచించే పరిస్థితులు దాఖలు లేవు. ఇటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఇటీవల ప్రకటించిన తొలి జాబితాలో అత్యధిక స్థానాలు బీసీలకు కేటాయించడం సంతోషకరమైన విషయం. మిగతా పార్టీలు కూడా బీసీలకు సీట్ల కేటాయింపులో న్యాయం చేస్తూ బీసీ ముఖ్యమంత్రి ప్రకటనలు చేయాలని బీసీ సమాజ్ డిమాండ్ చేస్తుంది. భవిష్యత్తూ కార్యాచరణ క్షేత్ర స్థాయి బిసి సమాజ్ సంఘాల తో చర్చించి దిశ నిర్దేశం చేస్తామని పేర్కొన్నారు.
-----------------------
Admin