Thursday, 30 July 2026 04:02:40 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఇదేనా విశ్వ నగరం.. నెలల తరబడి పొంగి పొర్లుతున్న మురుగునీరు... చోద్యం చూస్తున్న అధికారులు...

Date : 12 July 2023 08:29 AM Views : 494

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మంజులా రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మల్ రెడ్డి రాంరెడ్డి నాగోల్ లోని పలు కాలనీలలో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చాలా కాలనీలలో వీధి దీపాలు లేవని, తాగునీటి సమస్య, డ్రైనేజీ సమస్యలు ఉన్నట్లు వారు రాంరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రాంరెడ్డి మంజులా రెడ్డి, టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డి, ఎస్టీ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ గాంధీ నాయక్, కొత్తపేట డివిజన్ అధ్యక్షులు కిషోర్ గౌడ్, గడ్డి అన్నారం డివిజన్ అధ్యక్షులు వేణు యాదవ్, హయత్ నగర్ డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, యూత్ కాంగ్రెస్ జైపాల్ రెడ్డి, ఎన్ఎస్యుఐ సాయి, కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో రాంరెడ్డి మాట్లాడుతూ గత మూడు నెలలుగా ఆనంద్ నగర్ చౌరస్తా నుండి బండ్లగూడ చౌరస్తా వరకు డ్రైనేజీ సమస్య లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా స్ధానిక అధికారులు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. దిల్‍సుఖ్‍నగర్ నుండి నాగోల్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు కు వెళ్లడానికి ఇది ప్రధాన రహదారి కావడం వలన ఇక్కడ మురుగునీరు పారుతుండడంతో ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు, అదేవిధంగా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. దుర్వాసన వస్తుండడంతో చుట్టు ప్రక్కల ఉన్న వ్యాపార సముదాయాలకు వినియోగదారులు రాకపోవడం వల్ల వారు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోనులో మాట్లాడి తక్షణమే సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని రాంరెడ్డి ఆదేశించారు. లేనియెడల దీనిపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో శ్రీరాములు, ప్రభాకర్ రెడ్డి, అరుణ్, లాలయ్య గౌడ్, సత్యనారాయణ రెడ్డి, రమేష్ రెడ్డి, మహేష్, బాలచందర్, కల్పనా రెడ్డి, వై భాను, సంగీత తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: