సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజక వర్గంలో దేవాలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుబోతున్నాయి. ఇన్నాళ్లు కనీసం ఆదాయం లేక ఇక్కట్లు పడుతున్న ఈ ఆలయాల అర్చకులకు ప్రభుత్వ ఆర్ధిక అండ లభించనున్నది. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం షాద్ నగర్ నియోజక వర్గ కేంద్రంలో స్ధానిక ఎమ్మేల్యే వై. అంజయ్య యాదవ్ ఆద్వర్యంలో నిర్వహించిన ఆధ్యాత్మిక దినోత్సవం రోజున అర్చకులకు ఎమ్మేల్యే చేతుల మీదుగా ధూప దీప నైవేద్య పథకం కింద నియామక పత్రాలను అందచేశారు. ఆలనాపాలనా లేక పూర్తిగా జీర్ణావస్థకు చేరిన దేవాలయాలను ప్రభుత్వం వాటిని కూడా గుర్తించి ధూప, దీప నైవేద్యం పథకం కిందకు తీసుకురావడం గొప్ప శుభ పరిణామం ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ద్వారా దూపదీప నైవేద్య పథకం క్రింద షాద్ నగర్ నియోజకవర్గంలో 22 మంది అర్చకులను ఎంపిక చేసినట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్చకులకు నియామక పత్రాలను ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అందజేశారు. కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కు పలువురు అర్చకులు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వేద పండితులు ఎమ్మెల్యే అంజయ్యకు వేద ఆశీర్వచనాలు అందజేశారు.
-----------------------
Admin