సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మాదిగ మాదిగ ఉప కులాలు రాజ్యాధికారం వైపు నడవాలి... గత 30 సంవత్సరాల నుంచి వివిధ రూపాలలో పలు మాదిగ సంఘాల పోరాట ఫలితంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలతో పాటు పలుమార్లు అసెంబ్లీ తీర్మానాలు మరియు సుప్రీంకోర్టు ప్రతిష్టాత్మక తీర్పు ఫలితమే నేడు మాదిగల చిరకాల కోరిక ఏబిసిడి వర్గీకరణ అని అందుకు వివిధ సమయాల్లో అసెంబ్లీ తీర్మానాలు చేసిన పార్టీలకు మరియు గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని మాదిగ సంఘాల మహాకూటమి చైర్మన్ పోకల కిరణ్ మాదిగ అన్నారు. మిర్యాలగూడలో జరిగిన పత్రిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్నదమ్ముల్లా కలిసి ఉండే మాల, మాదిగ మరియు ఉపకులాల సోదరులమంతా సోదర భావంతో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకు ముందుకు వచ్చి తమ తమ రాజ్యాంగ పలాలను పొందుతూ కలిసి ఉండాలని అన్నారు. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటున్నారని మెజారిటీ భాగం మాల మాదిగ సోదరులంతా వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారని త్వరలోనే మా ఆకాంక్ష తీరబోతుందని కుట్రలు చేసి అన్నదమ్ముల మధ్య కక్షపూరిత వాతావరనాన్ని ఎవరూ చేయకూడదని ఈ సందర్భంగా చేతులెత్తి జోడిస్తున్నామని ఆయన అన్నారు ,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆశయం ,ఆకాంక్ష అందరు సమానంగా రాజ్యాంగ పలాలు పొందాలని అని ఎవరైతే వర్గీకరణకు వ్యతిరేకంగా ఉంటారో వారు రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ,అంబేద్కర్ భావజాలాన్ని వ్యతిరేకిస్తున్న వారవుతారని అది వారి విజ్ఞతకే వదిలిస్తున్నామని, మాదిగ మాదిగ ఉపకలాలందరూ రాజ్యాధికారం వైపు నడవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ పి ఐ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నకరికంటి సంజీవ్ రావు ,జిల్లా ఇంచార్జ్ పోకల రవి, మిర్యాలగూడ నియోజకవర్గ ఇన్చార్జ్ కొత్తపల్లి సైదులు దామచర్ల మండల అధ్యక్షుడు కొమ్ము రాజేష్,భరపటి మురళీ, వాడపల్లి ఉపాధ్యక్షుడు కిషోర్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin