సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు పర్యటనలో భాగంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ డా. వినీత్ తెలియజేశారు బుధవారం కొత్తగూడెం లో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సీఎం పర్యటన లో భాగంగా కొత్తగూడెం పాల్వంచ పట్టణాల్లో ట్రాఫిక్ ఆంక్షలను గమనిస్తూ పోలీసువారికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సుమారు 2000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన ప్రదేశాల్లో అక్రమంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఎం పర్యటన విజయవంతం చేయాలి అని కోరారు.
-----------------------
Admin