Thursday, 30 July 2026 06:14:09 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఉపవాసం స్వీయ - నియంత్రణ, ధానాగుణం నేర్పుతుంది... -ఎం.ఎన్. బేగ్ జాహిద్

Date : 20 March 2023 01:53 AM Views : 464

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం పట్టణ చుంచుపల్లి మండలంలోని మస్జిదే ఏక్ మినార్ లో ఆదివారం జమాతే ఇస్లామి హింద్ కొత్తగూడెం శాఖ అధ్యక్షుడు ఎస్.కె. జహంగీర్ అధ్యక్షతన రంజాన్ మాస స్వాగత కార్యక్రమంలో జమాతే ఇస్లామి హింద్ రాష్ట్ర సెక్రెటరీ ఎం.ఎన్. బేగ్ జాహిద్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి సన్మార్గంలో నడస్తూ పరిశుద్ధమైన జీవనం కొనసాగించాలన్నదే ఇస్లాం యొక్క ముఖ్య ఉద్దేశమని , రంజాన్ మాసం అల్లాహ్ యొక్క తీవ్ర ఆరాధన మరియు అల్లాహ్ పట్ల భక్తి, సమగ్రమైన కృతజ్ఞతలతో, ​​అల్లాహ్ బోధనలను ప్రతిబింబిస్తూ, స్వీయ-నియంత్రణ, దయ కలిగి ఉండటం, ఆధ్యాత్మికంగా మెరుగైన వ్యక్తిగా తమ్ము తాము అభివృద్ధి పరచుకోవడం మరియు , ఇతరులతో సంబంధాలు కలిగి ఉండటం నేర్పుతుందని ఉద్భోదించారు. దివ్యఖురాన్ లో సృష్టికర్త ఐనా అల్లాహ్ ఇలా అంటున్నారు. "విశ్వాసులారా! ఉపవాసం మీకు విధిగా చేయబడింది. ఏ విధంగానయితే మీకు పూర్వం ప్రవక్తలను అనుసరించేవారికి విధించబడిందో. దీనివల్ల మీరు అల్లాహ్ కు భయపడతారని ఆశించబడుతోంది. (ఖుర్ఆన్ 2:183) "అల్లాహ్ సెలవిచ్చాడు; మనిషి చేసే ఆచరణలన్నీ తన స్వయానికి సంబంధించినవే. ఒక్క ఉపవాసం మినహా! ఎందుకంటే ఈ ఆచరణ (ఉపవాసం) నాది. స్వయంగా నేనే దానికి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాను అని సృష్టికర్త అయినా అల్లాహ్ సెలవిచ్చారని ఉద్భోదించారు.జమాతే ఇస్లామి హింద్ జిల్లా అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ మాట్లాడుతూ ఉపవాసము ఆర్ధికలేమి కలిగిన ప్రజల పట్ల సానుభూతి మరియు కరుణ పెంచుతుందని, ఉపవాసం పాపాల నుండి రక్షించే డాలు వంటిదని వివరించారు. ముఫ్తి యాకుబ్ మాట్లాడుతూ ఉపవాసి నోటి నుండి వెలువడే వాసన ప్రళయ దినాన దైవ సన్నిధిలో “ముల్క్" (కస్తూరి) కన్నా ఎక్కువ సువాసన కలిగి ఉంటుందని ఇస్లాం బోధనలు మనకు ఆదర్శమన్నారు.ఇస్లాం ధర్మంలో ఉపవాసము తప్పనిసరి మతపరమైన విధిగా, పరిగణించ బడుతుందని, రంజాన్ లో ఉపవాసం స్వీయ-నియంత్రణ నేర్పుతుందని, ఉపవాసము కఠినమైన అలవాట్లకు విరామం ఇస్తుందని, ఉపవాసం సమయంలో, కడుపుతో పాటు నాలుక, కళ్ళు, చెవులు, ఇతర అవయవాలు, మరియు గుండె మరియు మనస్సు సమానంగా నియంత్రణలో ఉంటాయని , మన భౌతిక ఆకలి తో పాటు ప్రతికూల భావాలను, చర్యలను కూడా నియంత్రించాలని బోధించారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామి హింద్ సభ్యులు ,మరియు జమాతే ఇస్లామి హింద్ మహిళా విభాగం ,ఎస్.ఐ.ఓ , జి.ఐ.ఓ సభ్యులు తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: