Saturday, 13 June 2026 02:10:32 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

కెసిఆర్ కూడా చంద్రబాబు శిష్యుడే...

Date : 20 July 2023 11:19 AM Views : 418

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : రేవంతే కాదు కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు శిష్యుడైనని తెలుగుదేశం పార్టీ నల్గొండ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జి మండవ వెంకటేశ్వర్లు గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. రేవంత్ చంద్రబాబు శిష్యుడు అంటూ టిఆర్ఎస్ నాయకులు వ్యంగంగా మాట్లాడుతున్నారని టిఆర్ఎస్ పార్టీలో ఉన్న 90 శాతం మంది కూడా చంద్రబాబు నాయుడు శిష్యులేనన్న విషయాన్ని బిఆర్ఎస్ నాయకులు గుర్తుంచుకోవాలన్నారు. చంద్రబాబు నాయుడు ని విమర్శించి లబ్ధి పొందాలనుకోవడం సిగ్గుచేటు అన్నారు. నాడు తెలంగాణ వాదంతో తెలుగుదేశం పార్టీపై ఆంధ్ర ముద్ర వేసి లబ్ధి పొందిన కేసీఆర్ నేడు మరల తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని దీన్ని తెలంగాణ ప్రజానీకం ఖండించాలన్నారు. తెలంగాణ అభివృద్ధిలో , తెలంగాణ ఏర్పాటులో చంద్రబాబు నాయుడు పాత్రను ఈ ప్రాంత ప్రజలు గుర్తించాలన్నారు. గూట్లో రాయి తీయలేనోడు ఎట్లో రాయి తీస్తానన్నట్లుగా కేసీఆర్ పాలన ఉందన్నారు. తెలంగాణను నిండా ముంచిన కేసీఆర్ బిఆర్ఎస్ పేరుతో దేశాలు తిరుగుతున్నాడని, తెలంగాణలో పుట్టిన తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన చంద్రబాబు నాయుడు పై తప్పుడు ప్రచారాలు చేయటం కెసిఆర్ కు , ఆ పార్టీ నాయకులకు తగదన్నారు. చంద్రబాబు నాయుడు పై తప్పుడు ప్రచారాలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ కన్వీనర్ కొమ్మగని వెంకటేశ్వర్లు గౌడ్ మఠంపల్లి మండల పార్టీ కన్వీనర్ మాలోతు నాగునాయక్, గుండు వెంకటేశ్వర్లు, కంకరతన్యం తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :