సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం లీగల్ : హత్య కేసులో మహిళకు జీవిత ఖైదు విధిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ శుక్రవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. సుజాతనగర్ మండలం సింగభూపాలెం కు చెందిన కాకటి జగ్జీవన్ రావు తన బాబాయ్ పెద్ద కుమారుడైన కాకటి శ్రీను కు సుజాతనగర్ కు చెందిన కత్తి వెంకటేశ్వర్లు గారి పెద్ద కుమార్తె అయిన కత్తి సరస్వతి తో పెద్దల సమక్షంలో ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగిందని ఇద్దరి మధ్య గొడవలు జరిగి, పెద్దమనుషుల పంచాయతీ లు పెట్టడం జరిగింది.తదుపరి కొత్తగూడెంలో వేరే కాపురం పెట్టారని క్రిస్టమస్ సందర్భంగా 2019 డిసెంబర్ 24న సింగభూపాలెం వచ్చారని అదే రోజు రాత్రి సులాయి వంట(నల్ల )చేసిందని రాత్రి పదిన్నరకు తన భర్త అయినా కాకటి శ్రీనుకు మాత్రమే సులాయ(నల్ల)వంట వండిపెట్టినదని సరస్వతి తినలేదని అర్థరాత్రి వాంతులు విరోచనాలు అవి బాధపడటం వలన ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించినారని అనంతరము డాక్టర్ రమేష్ బాబు ప్రైవేటు వైద్యశాలకు, తదుపరి గాయత్రి వైద్యశాల డాక్టర్ నాగరాజు వద్దకు వద్ద మూడు రోజులు ఉంచామని, ఖమ్మం కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్లామని, తడుపరి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ కు తీసుకెళ్లామని, 19 జనవరి 20న మధ్యాహ్నం మృతి చెందాడని గాంధీ హాస్పిటల్ హైదరాబాదులో ఉండడం వల్ల దరఖాస్తు ఇవ్వడం తో సుజాతనగర్ పోలీస్స్టేషన్లో అప్పటి ఏఎస్ఐ వెంకటేశ్వరరావుకు 2020 జనవరి 20 న ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,సర్కిల్ ఇన్స్పెక్టర్ బి అశోక్ లు దర్యాప్తులో కాకటి శీను భార్య సరస్వతి వల్లనే హత్యగావింప బడినాడని కోర్టులో దర్యాప్తు అనంతరం ఇన్స్పెక్టర్ బి. అశోక్ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.కోర్టు లో 11 మంది సాక్షులను విచారించారు. కాకటి సరస్వతి పై హత్యా నేరం రుజువుకావడంతో జీవిత ఖైదు మరియు 2000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రొసీక్యుషన్ పోసాని రాధాకృష్ణమూర్తి నిర్వహించారు. కోర్టు డ్యూటీ ఆఫీసర్ (హెడ్ కానిస్టేబుల్ )బి. లచ్చు ,కోర్టు లైజాన్ ఆఫీసర్ వీరబాబులు సహకరించారు.
-----------------------
Admin