సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పెదవీడు గ్రామంలో ఆ పార్టీ గ్రామశాఖ సమక్షంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు షేక్ కరీం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మాత్యులు,నల్గొండ పార్లమెంట్ ఇన్చార్జి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల అనుసారం గ్రామంలో ప్రచారం విజయవంతంగా నిర్వహిస్తున్నామని, ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ప్రతి గ్రామ పౌరుడు కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేస్తున్నారని , రాహుల్ గాంధీ ని ప్రధాన మంత్రి గా చూడడానికి ప్రతి పౌరుడు ఎదురుచూస్తున్నారు అన్నారు. రఘువీరా రెడ్డి ని 4 లక్షల ఓట్ల మెజారిటీ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తద్వారా ఈ నియోజకవర్గ అభివృద్ధికి మార్గం సుగుమం అవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సయ్యద్ బీబి కూతుబ్, మఠంపల్లి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తెల్లబాటి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బూర సోములు గౌడ్,మాజీ సింగల్ విండో డైరెక్టర్ గాయం ఆదిరెడ్డి,గ్రామ మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ వహబ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి,అమరవరపు వెంకటి,సయ్యద్ రహీం,పట్టేటి లింగయ్య,మాజీ వార్డు సభ్యులు రెడపంగు నాగరాజు,పట్టేటి నర్సింహా, సీతారాములు, కాషయ్య మైనారిటీ నాయకులు నభి,రహీం తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin