సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : అమడుగూరు మండలం జోరు వానలోను ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో దూసుకుపోతున్నారు. ఆమడగూరు మండలం తిమ్మిరికుంటపల్లి,సంగీతంపల్లి పట్రవాండ్లపల్లి నిలువురాతిపల్లి గ్రామాల్లో నేడు నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వర్షం కురుస్తున్నా ఇంటింటికి తిరిగిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇల్లు పింఛన్లు సిసి రోడ్లకు సంబంధించి పలర్జీలను స్వీకరించి కొన్నింటికీ అక్కడికక్కడే పరిష్కారం చూపారు. కులమత పార్టీల కతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు.అర్హులై ఉండి సంక్షేమ పథకాలు అందకపోతే సంబంధిత వాలంటీర్ ద్వారా సచివాలయాలను సంప్రదిస్తే మీ ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలు అందిస్తామని స్పష్టం చేశారు. సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆదర్శవంతమైన పాలన సాగిస్తున్న సీఎం జగన్కు అందరూ రుణపడి ఉండాలన్నారు. మీ అందరి ఆశీస్సులతో రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.....
-----------------------
Admin