Saturday, 13 June 2026 02:02:38 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ... సినీ హీరో ఎన్టీఆర్ తో సమావేశమైన మంత్రి పువ్వాడ

Date : 02 May 2023 11:07 PM Views : 704

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం లకారం ట్యాంక్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 54 అడుగుల భారీ విగ్రహ ఆవిష్కరణకు సన్నాహాలు వేగంగా సాగుతున్నాయి. ఎన్. టీ. రామారావు శత జయంతి సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి మే 28న తెలుగు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆవిష్కరణ చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను ఆయన నివాసంలో ప్రత్యేకంగా కలిసి విగ్రహావిష్కరణ ప్రారంభానికి సంబంధించి ఏర్పాట్లుపై వారు చర్చించారు. ఈ నేపథ్యంలో మే 28న శ్రీకృష్ణుని అవతారంలో ఎన్టీఆర్‌ పర్యాటకులను ఆకర్షించనున్నారు. ఇప్పటికే విగ్రహం తయారు పూర్తయి, విగ్రహ తరలింపుకు రంగం సిద్ధమైందని తెలిపారు. మే 28న పండుగ వాతావరణంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ భారీ విగ్రహ ఆవిష్కరణను చేయనున్నారు. బేస్‌మెంట్‌తో కలిపి 54 అడుగులు ఎత్తు ఉండే ఈ విగ్రహంలో తల భాగం ఐదు అడుగులు, కాళ్ల భాగం ఐదు అడుగులు ఇంకా మొత్తం శరీర భాగం ఎత్తు మాత్రమే 45 అడుగులుగా ఉండనుంది. ఎటు చూసినా 36 అడుగుల పొడవు వెడల్పులతో వెయ్యి అడుగుల విస్తీర్ణం ఉండే బేస్‌మెంట్​ పైన ఈ విగ్రహాన్ని అమర్చనున్నారు. రూ. 2. 3 కోట్ల వ్యయం కానున్న ఈ విగ్రహం ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను పొందడంలో రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చొరవ చూపారు. అవసరమయ్యే నిధులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తానా సభ్యులతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ఎన్నారైలు సహకరిస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :