సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : కార్యకర్తలకు అండగా టిఆర్ఎస్ -టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ -రూ.2లక్షల ప్రమాద బీమా చెక్కు పంపిణి చేసిన ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పార్టీ కోసం పని చేసే వారికీ టిఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవరకొండ మండలంలోని కొండబిమనపల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఎర్ర రామస్వామి ఇటీవల మృతి చెందాడు.రామస్వామి టిఆర్ఎస్ ప్రమాద బీమాలో సభ్యత్వం పొందడంతో బీమా పథకం కింద మంజూరైన రూ.2లక్షల చెక్కును ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ మృతుడి బార్య వెంకటమ్మ కు అందజేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ మాట్లాడుతూ....గ్రామా స్థాయి నుంచి పార్టీ ని పటిష్టపర్చడంలో కార్యకర్తల పాత్ర క్రియాశీలకమైందన్నారు.టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం పేదల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది అని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా పార్టీ కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలని కోరారు. కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ ప్రవేశ పెట్టిన ప్రమాద బీమా పథకం లో సభ్యత్వం తీసుకోవాలని ఆయన అన్నారు.పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త పని చేయాలనీ సూచించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మారుపాకుల అరుణసురేష్ గౌడ్,టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు TVN రెడ్డి, రైతు సంఘం అధ్యక్షులు మునికుంట్ల వెంకట్ రెడ్డి,టిఆర్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల రాజు,కడరీ తిరపతయ్య,బోడ్డుపల్లి కృష్ణ,వాడిత్య బాలు,ఇలియస్ పటేల్,ఎర్ర యాదగిరి, ఎర్ర విజయ్ కుమార్,సైదులు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin