సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట్ మండల పరిధిలోని బేర్ ఖాన్ పల్లి గ్రామం లో టిపిసిసి ప్రధాన కార్యదర్శి, షాద్ నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ వీర్లపల్లి శంకర్, రూప్ల నాయక్ రాఘవేందర్, అంజయ్య, యాదయ్య, ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నాయన్నారు ఈ బేర్ ఖాన్ పల్లి గ్రామంలో మాల మాదిగాల కుటుంబం నుంచి భూములను దౌర్జన్యంగా అక్రమంగా లాక్కున్నారని, పేదల ప్రజల సంక్షేమ పథకాలు గ్రామ అభివృద్ధి చేయకపోగా అమాయక ప్రజలపై కేసులు పెడుతున్నారన్నారు తొమ్మిదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం బేర్ ఖాన్ పల్లి లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని గత కాంగ్రెస్ పార్టీ హయంలో జరిగిన అభివృద్దే తప్ప ఈ తొమ్మిదేళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు గ్రామీణ ఉపాధి హామీ పథకం పేద ప్రజలకు ఆసరాగా ఉండే పథకం ఆ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, అక్రమంగా డబ్బులు దండుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను దౌర్జన్యంగా బెదిరించి అరాచకాలు సృష్టించి కేసులు పెట్టి మా కార్యకర్తలకు కండువాలు కప్పుతున్నారు కండువాలు మీవి, ఓట్లు మావి రాబోయే ఎన్నికలో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. బేర్ ఖాన్ పల్లి, మాజీ సర్పంచ్ రూప్ల నాయక్ మాట్లాడుతూ.. గ్రామంలో అధికార దాహంతో దౌర్జన్యాలకు పాలు పడుతున్నారని, బెదిరించి అరాచకాలు సృష్టిస్తూ మా పార్టీలో చేరితే తప్ప మీ గ్రామ అభివృద్ధి జరగదు అని మా పార్టీ నాయకులను కార్యకర్తను బిఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారన్నారు. మా గ్రామము షాద్ నగర్ నియోజకవర్గం జాబితాలో ఉందా లేక వేరే రాష్ట్రంలో ఉందా మాకు అర్థం కావడంలేదన్నారు పార్టీకి అభివృద్ధికి సంబంధం అంట కట్టి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు అన్నారు రూప్ల నాయక్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పి, కుమార్ యాదవ్, ఉపాధ్యక్షులు వి గణేష్ గ్రామ ఉపసర్పంచ్ గుండ్డగల మాణెమ్మ, అంజయ్య, గ్రామ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin