సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలో అంగన్వాడీల ఆధ్వర్యంలో లింగ వివక్షతకు వ్యతిరేకంగా మాసోత్సవాలు నిర్వహించారు. హై స్కూల్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా ఓబుల దేవర చెరువులో అంగన్వాడిలు మానవహారం ఏర్పాటు చేసి లింగ వివక్షతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆడబిడ్డల పట్ల వివక్షత చూపడం సరికాదన్నారు. ఇప్పటికే ఆడ మగ శిశువుల మధ్య నిష్పత్తి రేటు చాలా తక్కువగా ఉందని ఇదిలాగే కొనసాగితే భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయి అన్నారు. ప్రతి ఆడపిల్ల ను బాగా చదివించాలని నినాదాలు చేశారు ఇల్లాలి చదువు ఇంటికి వెలుగన్న సూక్తిని నిజం చేయాలన్నారు. మహిళల పట్ల జరుగుతున్న హింసను ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పోలప్ప ఏపీవో రమణప్ప, పంచాయతీ సెక్రెటరీ ప్రకాష్, అంగన్వాడి సూపర్వైజర్ జయమ్మ, అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin