సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సుజాతనగర్ : తెలంగాణ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని మంగళవారం టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు హైదరాబాదులోని ఎల్లా హోటల్ లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల బాగు కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చేందుకు టిపిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి తీవ్రంగా కష్టపడి, పార్టీలోని ముఖ్యలను కలుపుకొని పార్టీని గెలుపు దిశగా పయనింపజేయడంలో సక్సెస్ అయ్యారని ఆయన అన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, జాతీయ సభ్యులు చాడా వెంకట రెడ్డి, పల్లా వెంకట రెడ్డి లతో కలిసి ఆయన రేవంత్ రెడ్డికి పుష్ప గుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు
-----------------------
Admin