Friday, 31 July 2026 12:59:54 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మనసున్న మారాజులు ఆదుకోండి...

Date : 20 February 2024 11:07 AM Views : 441

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : రామారావు పేట గ్రామంలో గల అతి నిరుపేద కుటుంబానికి చెందిన పొడియం రాంబాబు (36) ఒక సంవత్సరం క్రితం వ్యవసాయ పనుల నిమిత్తం పొలం దగ్గరకు వెళ్లి గట్టు మీద నుండి కాలు జారి కింద పడ్డాడు.ఆసుపత్రికి తీసుకుని వెళ్లి చూపించగా సంబంధిత వైద్యులు పరీక్షించి వెన్నెముక దెబ్బతిందని చెప్పారు.ఈ సమస్యని వైద్య పరిభాషలో spine with paraplegia అని అంటారు.వైద్యులు శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.దీనికి గాను రూ 4.50 లక్షల ఖర్చు అవుతుందని చెప్పారు.వీరి దగ్గర అంత స్తోమత లేదు.అప్పట్నుంచి మంచానికే పరిమితం అయ్యాడు.తండ్రి 3 సంవత్సరాల క్రితమే చనిపోయాడు.తల్లి వెంకటనర్సమ్మ అన్నీ తానై సాకుతుంది.రాంబాబు పీజీ వరకు చదువుకున్నాడు కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు కంపెనీలో చిన్న పాటి ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించే వాడు.వెన్నెముక దెబ్బతిని ఆరోగ్యం క్షీణించి మంచానికే పరిమితం కాగా ఇక చేసేదేమీ లేక దాతల సాయం కోసం ఎదురు చూస్తూ స్థానికంగా గల బ్యూటిఫుల్ లైఫ్ అసోసియేషన్ వారిని సాయం కోరగా స్పందించిన నిర్వాహకులు ఈ రోజు వారింటికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పి గౌరవ సభ్యులందరి తరపున రూ 2000/- మరియు ఈ విషయాన్ని బిఎల్ఏ సపోర్టర్స్ అయినటువంటి విజయవాడకు చెందిన డెర్మోకేర్ ఆసుపత్రి యాజమాన్య దంపతులు రాజీవ్, డాక్టర్ ప్రవీణ దృష్టికి తీసుకు వెళ్లగా వారు మానవత్వంతో స్పందించి 20,000/-రూ బిఎల్ఏ నిర్వాహకులకు ఫోన్ పే ద్వారా అందించారు.అట్టి మొత్తాన్ని గ్రామస్తుల సమక్షంలో బిఎల్ఏ నిర్వాహకులు బాధిత కుటుంబానికి అందజేసారు.శస్త్ర చికిత్స చేస్తే నడిచే అవకాశం ఉందని సంబంధిత వైద్యులు చెప్పారు.కనుక మానవత్వం గల దాతలు మీకు తోచినంత సాయం చేయగలరు. బాధిత కుటుంబం ఫోన్ నెంబరు:9381335897, Phone pe,Google pay number beautiful life association 9390918358. సాయం పొందిన బాధిత కుటుంబం బిఎల్ఏ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఏ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యామల రవివర్మ,గౌరవ బిఎల్ఏ సభ్యులు కణితి రాముడు,తామ రాజు,వర్సా విష్ణు, బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సహాయానికి నిరంతరం సహకరిస్తున్న గౌరవ బిఎల్ఏ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అభాగ్యులకు అండగా నిలబడుదాం మానవత్వాన్ని కాపాడుదాం

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: