Saturday, 13 June 2026 12:47:36 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

ఔషధ తనిఖీ అధికారి కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే...

Date : 31 January 2023 11:20 PM Views : 455

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కదిరి టౌన్ స్థానిక ఏరియా ఆసుపత్రి ఆవరణంలో నూతనంగా నిర్మించిన ఔషధ తనిఖీ అధికారి కార్యాలయం ను కదిరి శాసనసభ్యులు డాక్టర్ పి వి సిద్దా రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మొదట జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆవరణంలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీ పి రమేష్ రెడ్డి చొరవతో నాణ్యతలో ఎటువంటి రాజిలేకుండా అద్భుతమైన భవనాన్ని నిర్మించిన కాంట్రాక్టర్ లోకేశ్వర్ రెడ్డి ని అభినందించారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా కదిరి ప్రాంతంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ భవనాన్ని ప్రారంభించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దాదాపు 500 కు పైగా కదిరి ప్రాంతంలోనే ఔషధ దుకాణాలు ఉండడం వల్ల ఇక్కడే ఈ బిల్డింగ్ ఏర్పాటు చేయడం మంచి శుభ పరిణామం అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యానికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చి నాడు నేడు కార్యక్రమం ద్వారా వైద్య విధానాలలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారన్నారు. ప్రభుత్వ వైద్యశాలలలో అత్యాధునికమైన పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చి, ప్రతి పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందజేస్తున్నారన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిస్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తూ రూ. 1000 రూపాయలకు పైబడిన ప్రతి జబ్బుకు ఆరోగ్యశ్రీని వర్తింపజేసి దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆరోగ్య సేవలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. ఒకనాడు మూలన పడేసిన 108 మరియు 104 వాహనాలను ప్రతి మండల స్థాయిలోనూ అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. ఇక్కడే మనం చూస్తున్నాం కదిరి ఏరియా ఆసుపత్రి నందు కరోనా సమయంలో ప్రజలకు ఎంత మెరుగైన వైద్యం అందజేశామో మనందరికీ తెలుసు అన్నారు. పక్కనే అత్యధికమైన వసతులతో మరో అద్భుతమైన భవనాన్ని నిర్మించు కుంటున్నామన్నారు. ప్రతి సచివాలయ పరిధిలో ఒక హెల్త్ సెంటర్ ను అర్బన్ ఏరియాలో అర్బన్ హెల్త్ సెంటర్ లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేనివిధంగా నూతన వైద్య కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని మెరుగైన సేవలు అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు చేపట్టారని తెలియజేశారు.రాష్ట్రవ్యాప్తంగా 13 డ్రగ్ ఇన్స్పెక్టర్ బిల్డింగులు సాంక్షన్ కాగా అందులో ఒకటి కదిరి కావడం, దీనిని కూడా పుట్టపర్తికి మార్చాలన్న పరిస్థితిని ముఖ్యమంత్రి చొరవతో కదిరినందు ఏర్పాటు చేసినందుకు జగన్మోహన్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ పి రమేష్ రెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హుస్సేన్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, మెడికల్ స్టోర్ యాజమాన్యం మరియు వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :