సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు : సబ్సిడీ వేరుశెనగ కోసం మండల పరిధిలోని రైతులు తమ సంభందిత రైతు భరోసా కేంద్రాలలో పేర్లు నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి యస్. ఇలియాజ్ మహమ్మద్ తెలిపారు. శుక్రవారం ఈ సందర్భంగా ఇలియాజ్ మహమ్మద్ మాట్లాడుతూ కేసిక్స్ రకం 4387 క్వింటాల్ మండలానికి కేటాయించారని, రైతులు తమ ఆధార్ కార్డ్, ఫోన్ నంబర్, పట్టాదార్ పాసుపుస్థకమ్ జిరాక్స్లు తీసుకొని రైతు భరోసా కేంద్రాలలో ఇవ్వాలి, రైతు భరోసా కేంద్రాలు వేరుశనగ విత్తనం కోసం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్లు పనిచేస్తాయని, అర ఎకరాకు 30 కేజీలకు రూ 1674 , అర ఎకరా నుండి ఒక ఎకరా వరకు 60 కేజీలకు రూ 3,348, ఒక ఎకరా పైన 90 కేజీలకు రూ 5,022 ధరలు రైతులు చెల్లించాల్సి ఉంటుందని ఈ అవకాశాన్ని మండలపరిధిలో నిగ్రామాల రైతులు ఈ అందరు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి S. ఇలియాజ్ మహమ్మద్.తెలిపారు.
-----------------------
Admin