సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : సత్తుపల్లి నియోజకవర్గంలో నికల్లూరు మండలం రఘునాథగూడెం గ్రామంలో అభివృద్ధి పనుల ను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యప్రారం భించా రు. రఘునాథగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు వేదికను సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ప్రారంభించారు. రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు గారు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వర రావు, రఘునాథగూడెంలో నూతనంగా 35 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డును ఎమ్మెల్యే సండ్ర ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆసరా పింఛన్ లబ్ధిదారులకు గుర్తింపు కార్డులను, కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు పెళ్ళికానుకగా చీరను, సీఎం రిలీఫ్ అని చెక్కులను ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు మహిళలు ఘన స్వాగతం పలికారు.
-----------------------
Admin