సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి : మండలం లోని అన్ని ప్రభుత్వ మరియు ప్రవేటు పాఠశాలలో మంగళవారం రోజున బాలల దినోత్సవం వేడుకలను నిర్వహించడం జరిగింది. బాలల దినోత్సవం అంటే జవహర్ లాల్ నెహ్రూ నవంబర్ 14 వ తేదీన జన్మించడం జరిగింది. ఇందువలన వలన వారి పుట్టిన రోజును తనకు ఎంతో ఇష్టమైన బాలల దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించటం జరిగింది. నెహ్రు భారత స్వాతంత్ర పోరాటం లో పాల్గొన్నా తరువాత మొదటి ప్రదాన మంత్రి గా పని చేశారు.ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం అందుకే ఆయన పుట్టిన రోజునా బాలల దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించు కోవడం జరిగింది. అందుకే ఈరోజునా పిల్లలందరూ ఎంతో ఆనందంగా గడపాలని వారికి అనేక రకాల ఆట, పాటలు, సాంస్కృతిక కార్యక్రమలు నిర్వహిస్తారు. అందులో భాగంగా మండలం లోని ఎర్రగుంట, మరియు రాజాపురం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరియు శ్రీ చైతన్య ప్రవేట్ పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. అట్టి పాఠశాలల లో స్వయంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా పాఠశాలలను నిర్వహించారు.అలాగే ఈ కార్యక్రమాలలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin