సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : శ్రీ సత్యసాయి ప్రభుత్వ డిగ్రీ కళాశాల బుక్కపట్నంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆదర్శ విద్యాసంస్థల అధినేత *శ్రీ పెదరాసు సుబ్రమణ్యం *ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలకు గర్వకారణం వాలీబాల్ క్రీడాకారులు అని ప్రశంసించారు. క్రీడాకారులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. తాను కూడా ఈ కళాశాలలో చదివి ఉన్నత స్థానానికి వచ్చానాని, విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు అలవర్చుకొవాలని ఎంతోమందికి నేడు ఉపాధిని కల్పిస్తున్నానన్నారు. తన సంస్థలో ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థానాలను పొందారన్నారు. తాను బుక్కపట్నం మండలానికి ఎంపీపీగా బాధ్యతలు నిర్వహించను. ఎంతో ప్రసిద్ధి చెందిన తిమ్మమ్మ మర్రిమాను దానికి కారణమైన తిమ్మమాంభ జీవిత చరిత్రను స్థిర స్థాయిగా గుర్తుండి పొయేలా సతీ తిమ్మమాంభ పేరుతో సినిమాకు నిర్మాతగా వ్యవహరించాను. విద్యార్థులు చక్కగా చదువుకొని తమ నైపుణ్యాల్ని ప్రదర్శించాలన్నారు.అటువంటి విద్యార్థులకు నేను ఎల్లవేళలా అండగా ఉంటఅని ఆయన తెలిపారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఏ.లక్ష్మయ్య మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. జిల్లాలో జరిగిన వాలీబాల్ క్రీడా పోటీలో తమ కళాశాల క్రీడాకారులు వాలీబాల్ జట్టు విజయం సాధించడం మాకు ఎంతో ఆనందదాయకం అన్నారు. క్రీడాకారులకు క్రీడా కౌశలాన్ని నేర్పిన కళాశాల వ్యాయామ అధ్యాపకులు వినయ్ కుమార్ ని మరియు క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రవికుమార్, గ్రంథాలయ అధికారి వెంకటేశ్వర ప్రసాద్ అధ్యాపకులు డా.ఆదినారాయణ,దస్తగిరి,ఓబయ్య,ఆనంద్,నాగేంద్ర, రాజశేఖర్, వెంకటేశ్వర్ కుమార్, బోధినేతల సిబ్బంది రామాంజనేయులు,రమేష్,శంకర,ఉదయ్,విద్యార్థులు పాల్గొన్నారు.....
-----------------------
Admin