సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపిఎస్ ట్రైనింగ్ ఐపీఎస్ అధికారి రాజేష్ మీలా తో కలిసి మేళచెరువు మహాశివరాత్రి జాతరకు సంబంధించి పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు వాహనాల మళ్లింపు పార్కింగ్ ప్రదేశాలు రోడ్డు మార్గాలు జాతర నిర్వహించే స్థలం దేవాలయం భద్రత పరిశీలించారు అనంతరం స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు మేళ్లచెరువు మహాశివరాత్రి జాతరకు ప్రతిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు ప్రజలకు భద్రత కల్పిస్తా అని ఎస్పీ తెలిపారు .బందోబస్తు ఏర్పాట్లపై జాతర నిర్వహణపై అధికారులకు సిబ్బందికి పాలు సూచనలు సలహాలు అందించారు. దేవాలయ సిబ్బంది స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయంగా పనిచేస్తామని తెలిపారు. భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయాలని దేవాదాయ సిబ్బందిని ఆదేశించారు జాతరకు వచ్చే భక్తులు వాహనాలు నిలుపుకోవడానికి మేళ్లచెరువు వచ్చి పోయే అన్ని ప్రధాన మార్గాలలో పార్కింగ్ ప్రదేశాలు హోల్డింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశామన్నారు. బారికేట్లు సైన్స్ బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. జాతరను సీసీ కెమెరాలు ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు ఎస్పీ వెంట ట్రైనీ ఐపీఎస్ అధికారి రాజేష్ మీలా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజేష్ కోదాడ సర్కిల్ ఇనిస్పెక్టర్ రజిత రెడ్డి స్థానిక ఎస్సై పరమేష్ తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin