సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పి ఎస్. వి.మాధవ రెడ్డి ఐపీఎస్ , గురువారం గోరంట్ల, ఓబులదేవరచెరువు, అమడగూరు పోలీస్ స్టేషన్లను, వాటి పరిదిలో ఏర్పాటు చేసిన అంతర రాష్ట్ర చెక్ పోస్ట్ లను ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ల నిర్వహణ, సిబ్బంది పనితీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టర్, వివిధ క్రైమ్ రికార్డ్స్ లను పరిశీలించాడు. పోలీస్ స్టేషన్ పరిసరాలను, స్టేషన్లో సీజ్ చేయబడిన వాహనాలను, లాకప్ గదులను మరియు కంప్యూటర్ గదిని క్షుణ్ణంగా తనిఖీచేసి స్టేషన్ పరిధిలోని మెన్ పర్టిక్యులర్స్ అడిగి తెలుసకున్నారు. గోరంట్ల స్టేషన్ పరిది లో గల బెస్ట్ విస్వవిద్యాలయం, ఇతర కళాశాల లలో విద్యార్ధుల కు మాదకద్ర్యాలు , జూదం మొదలైన వాటికి దూరంగా ఉండేలా అవగాహన కల్పిస్తూ, కళాశాలల పై నిఘా ఉంచాలని తెలియజేశారు. పోలీస్ స్టేషన్ పరిది లో పెండింగ్ కేసులను తగ్గించాలి అని, మట్కా గాంబ్లింగ్, ఇసుక అక్రమ రవాణా పై దృష్టి సారించి నిఘా పెంచాలని, సిబ్బంది నీ పూర్తి స్థాయి లో వినియోగించుకోవాలని తెలియజేశారు. సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ లను అమలుపరచాలని చేయాలని తెలియజేశారు.స్టేషన్ పరిధిలో క్రైమ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని, చెక్పోస్టులపై ప్రత్యేక దృష్టి సారించి ఇతర రాష్ట్రాల్లో నుంచి ఇతర రాష్ట్రాల మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్న అక్రమ మద్యం, పూర్తిస్థాయిలో అరికట్టాలని తెలియజేశారు.కర్ణాటక రాష్ట్రంలో త్వరలో సాధారణ ఎలక్షన్ నేపథ్యంలో అంతరాష్ట్ర సరిహద్దుల దగ్గర సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, చెక్ పోస్టు లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి అని. విధి నిర్వహణలో ఉన్న సిబ్బందికి తగు సూచనలు జారీ చేశారు. చెక్ పోస్టులలో నిరంతరం తనిఖీ చేస్తూ అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసి సమగ్రంగా విచారించాలని, పెద్ద మొత్తంలో వెళ్లే " ప్రీ బీస్ " పై నిఘా ఉంచాలని తెలియజేశారు.ఎన్నికల నేపద్యంలో సరిహద్దు గ్రామాలలో గల రౌడీషీటర్లును , బైండోవర్ చేయాలని, నాటు సారా తయారీ , అసాంఘిక కార్యకలాపాలు, నిర్వహిస్తున్న వ్యక్తులకు ఎవరైనా పోలీస్ సిబ్బంది సహకరించినట్లైతే వారు ఎవరైనా, ఎంతటి వారైనా ఉపెక్షించిది లేదని తెలియజేశారు. సరిహద్దు గ్రామాలలోని ప్రజలకు పక్క రాష్ట్ర ప్రజలకు మధ్య గల సంబంధాలను పోలీస్ స్టేషన్ సిబ్బంది ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు, గోరంట్ల సిఐ సుబ్బరాయుడు , ఎస్సై బాబు, అమడుగూరు ఎస్సై వెంకట్ రమణ, ఇతర పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు....
-----------------------
Admin