సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : డబ్బు మధ్యానికి అమ్ముడు పోకుండా ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని ప్రజాస్వామ్యంలో ప్రజాసేవ చేసుకునే నాయకులకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ షాద్ నగర్ అసెంబ్లీ అభ్యర్థి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. చౌదరి గూడ మండల కేంద్రంలోని తూంపల్లి చౌరస్తా నుండి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ర్యాలీ పెద్ద ఎత్తున వేల మందితో ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే మండల కేంద్రంలోని ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. అవినీతి పాలకులకు కుటుంబ పాలనకు అవకాశం ఇచ్చాము ఇక సాహించేది లేదు ఎన్నికలు వచ్చినప్పుడే ప్రతిపక్షాలకు ఉచిత హామీలు, మోసపురితమైన హామీలు గుర్తుకు వచ్చి మల్లి ప్రజలను మోసం చెయ్యడానికి కొత్త నాటకాలతో వస్తారు కాబట్టి జాగ్రత్త గా ఉండాలని కోరారు. ప్రజా క్షేత్రంలో ఉండి సేవా కార్యక్రమాలు చేస్తుంటే కూడా కక్ష కట్టి అడ్డుకునే ప్రయత్నాలు చేయడం చాలా సిగ్గు చేటని అన్నారు. ఎవరు ఎన్ని ఇబ్బందులకు గురి చేసిన అవమాన పర్చిన వెనక్కి తగ్గకుండా నా సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళి ప్రజల్లో ఉన్న వ్యక్తిని అని అన్నారు. సేవకుడికే అవకాశం ఇచ్చి సింహం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కొమురక్క మాట్లాడుతూ.. విష్ణన్న అంటే మహిళలకు, యువతకు అండగా ఉన్నాడని అన్నారు. మహిళలకు అండగా ఉంటూ ఇంటి పెద్దన్నగా ఉండి రాఖీ పండుగకు రాఖీ కానుక ద్వారా చీర, పసుపు, కుంకుమ ఇచ్చి ఆడ పడుచులకు పెద్దన్న అయ్యిండని పేర్కొన్నారు. యువతకు హెల్మెట్, లైసెన్స్ లు ఇచ్చి ప్రమాదాల బారిన పడకుండా అండగా ఉన్న విష్ణన్న కు ఒక్క అవకాశం ఇచ్చి భారీ మెజారిటి తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇస్నాతి శ్రీనివాస్, గోల్ల మల్లేష్, ఏదిర రాజు, శ్రవణ్, వీరేందర్ రెడ్డి, ప్రభు, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద వేల సంఖ్యలో పాల్గొన్నారు.
-----------------------
Admin