Thursday, 30 July 2026 04:07:25 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మాదిగల సంక్షేమం "జగనన్న"తోనే సాధ్యం... -ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కోకన్వీనర్ షాలెం రాజ్

Date : 24 April 2024 11:14 AM Views : 303

సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : యర్రగొండపాలెం : జగన్మోహన్ రెడ్డి తోనే మాదిగల సంక్షేమం సాధ్యమని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కో కన్వీనర్ షాలేంరాజు మాదిగ అన్నారు. మంగళవారం ఎర్రగొండపాలెం లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాబు నాయుడు ప్రభుత్వంలో మాదిగలకు జరిగింది ఏమీ లేదన్నారు. కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్ప సంక్షేమ పథకాల ఊసే లేదని ఆయన ఆరోపించారు. వర్గీకరణ పేరుతో తెలంగాణకు చెందిన మందకృష్ణ మాదిగ ఆంధ్రప్రదేశ్ లోని మాదిగ సోదరులను మోసం చేస్తున్నారని విమర్శించారు. అమాయకులైన మాదిగ సోదరులు మందకృష్ణ చెప్పే మోసపు మాటలను నమ్మవద్దని హితవు పలికారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాదిగ వర్గానికి చెందిన తానేటి వనితను హోం మంత్రిగా చేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా డాక్టర్ ఆదిమూలపు సురేష్ ను 2 పర్యాయాలు మంత్రిగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కిందని గుర్తు చేశారు. గతంలో సికింద్రాబాద్ లోని పరెడ్ గ్రౌండ్ లో నరేంద్ర మోడీని తీసుకొచ్చి ఏర్పాటు చేసిన సభ జాతిని మోసం చేసేందుకే అని తెలిపారు. మాల సోదరుల పట్ల తాము ఏనాడు వివక్ష చూపలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును గెలిస్తే మాదిగలు అన్యాయానికి గురవుతారని ఆయన అన్నారు. అదే వైసీపీ గెలిస్తే పేదలందరి గెలుపు అవుతుందని ఆయన అన్నారు. మందకృష్ణ మాదిగ కు చెందిన కొందరు చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మవద్దని స్పష్టం చేశారు. యర్రగొండపాలెం నియోజకవర్గం నుండి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న చంద్రశేఖర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు సోదరులంతా కృషి చేయాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఎమ్మార్పీఎస్ కో కన్వీనర్ పీటర్ మాదిగ, ఎన్ . జయరాజ్, త్రిపురా మాదిగ, నాగరాజు, చిన్ని, ముటుకూరి . రాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :