Thursday, 30 July 2026 06:48:06 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నేడు జాతీయ నులి పురుగుల నివారణ కార్యక్రమము...

Date : 03 August 2023 07:51 AM Views : 440

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా స్కూళ్లలో, కాలేజీలలో 1 నుండీ 19 సంవత్సరాల పిల్లలందరికీ కూడా ఆల్బెండజోల్ టాబ్లెట్లు వేయించాలని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఎస్. జయలక్ష్మి తెలిపారు. షాద్ నగర్ నియోజకవర్గం అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సూపర్వైజర్లు అన్నీ ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు పాఠశాలలో, అంగన్వాడి తెలియజేశారు. ఒక్కటి నుండి రెండు సంవత్సరముల మధ్య పిల్లలకు ఆల్బెండజోల్ ఆఫ్ టాబ్లెట్ ను క్రష్ చేసి స్పూన్ ద్వారా పిల్లలకి వేయాలని తెలియజేశారు. మూడు నుండి ఐదు సంవత్సరముల పిల్లలకి నమిలించి మ్రింగించాలని తెలియజెప్పారు. అలాగే ఆరు నుండి 19 సంవత్సరాల పిల్లలు అందరికి కూడా నమిలి మింగించాలని, ఈ టాబ్లెట్ భోజనం చేసిన తర్వాత ముగించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమాలు ఆయా గ్రామాలలో ఉన్న సర్పంచులకు, ఎంపీటీసీలకు మరియు పట్టణంలో మునిసిపల్ చైర్మన్, కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ప్రారంభించాలని తెలిపారు. ఈ జాతీయ నులిపురుగుల నివారణ ప్రోగ్రాంలో షాద్ నగర్ డివిజన్ లో 1 నుండి 19 సంవత్సరాల పిల్లలు మొత్తం 79,240 మందికి రేపు ఆల్బెండజోల్ టాబ్లెట్లు వేయనున్నట్లు డాక్టర్ జయలక్ష్మి తెలియ జేశారు. హెల్త్ ఎడ్యుకేటర్ జె.శ్రీనివాసులు, ఫరూక్ నగర్ మండలంలో రేపు నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా, ఫరూఖ్ నగర్ మండలంలోని 17, 710 బాలురులకు, 16,650 బాలికలకు మొత్తం విద్యార్థులు 34, 360 మంది పిల్లలకు ఆల్బెండజోల్ టాబ్లెట్లు వేయనున్నట్లు తెలియజేశారు. ఈ మాత్రలు భోజనం అనంతరము వేయాలని చెప్పారు. ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్ల ప్రోగ్రామును అందరు తల్లిదండ్రులు వారి పిల్లలకి అందరూ మింగేటట్లుగా చూడాలని ఈ ప్రోగ్రామ్ అందరు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. విద్యార్థులలో ఎవరికైతే జ్వరము లేదా కండ్ల కలక ఉన్న వారికి ఆల్బెండజోల్ టాబ్లెట్లు మాత్రలు మింగించకూడదని చెప్పారు. వారికి జ్వరం, కండ్ల కలక తగ్గిన తర్వాత మాప్ అప్ డే 10 వ తారీకు ఆగస్టు రోజున మింగించాలని తెలియజేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: