సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : దొంగతనం కేసును చాకచక్యంగా చేదించిన పెన్ పహాడ్ ఎస్సై రవీందర్ ని, పోలీసు సిబ్బందిని. సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం, సిఐ అశోక్ రెడ్డి వారిని అభినందించారు. వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని చీదేళ్ల గ్రామంలో వంగవీటి శ్రవణ్ కుమార్ 25 మే 2023 తేదీన ఇంటికి తాళం వేసి తీర్థయాత్రలకు వెళ్లగా గోపి సందీప్ (24) తండ్రి కాంతయ్య గ్రామం చీదేళ్ల మరియు రెడపంగి యశ్వంత్ (19) తండ్రి నాగార్జున గ్రామం చీదేళ్ళ ఇరువురు ఇంటి తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న నగలను దొంగలిచ్చుకొని వెళ్లి ఇంట్లో పెట్టుకుని వెంటనే అమ్మితే అందరికీ అనుమానం వస్తుంది అని, పాత మరుపు అయిన తర్వాత అమ్ముదాం అనుకొని సూర్యాపేటలో అమ్ముటకు వెళ్తుండగా మాచారం గ్రామ శివారులో పొట్లపాడు క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు పోలీసులు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ పై చాలా వేగంగా వెళుతుండగా ఎస్సై, పోలీస్ సిబ్బంది ఆపగా ఆపకుండా వెళుతుండగా అనుమానం వచ్చి వెంబడించి పట్టుకున్నారు. వారిని తనిఖీ చేయగా మోటార్ సైకిల్ నడిపే వ్యక్తి పాయింట్ జేబులో ఒక ప్లాస్టిక్ సంచి ఉన్నది. అందులో చూడగా బంగారం,నగలు ఉన్నవి పోలీసులు వారి ని అదుపులోకి తీసుకొని వారిని విచారించగా వారు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద ఉన్న మోటార్ సైకిల్,రెండు బంగారు గొలుసులు, మూడు చెవిదిద్దులు, రెండు ఉంగరాలు, బంగారు బిస్కెట్, ప్లాటినం కంపెనీ మోటార్ సైకిల్ ని వారు స్వాధీనం చేసుకున్నారు. వారిని రిమాండ్ కి పంపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ యాదగిరి, కానిస్టేబుల్ మచ్చ ప్రవీణ్, తురక లింగయ్య, జాటోత్ రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin