సర్కార్ టీవీ న్యూస్ / జనగామ జిల్లా : జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ డిసిసిబి ఛైర్మెన్, జంగా రాఘవ రెడ్డి జన్మదిన వేడుకలను గురువారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుఱ్ఱపు ప్రసాద్ మాట్లాడుతూ జంగా రాఘవ రెడ్డి రాజకీయంగా అనేక పదవులు నిర్వహించాలని పేదలకు సేవ చేసే అవకాశాన్ని దేవుడు కలుగచేయాలనీ కోరారు. అంతే కాకుండా ఆయనకు నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యలు ఆ భగవంతుడు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసిలు రొండి రాజు, జాలిగాపు వనమాల, పిఎసిఎస్ డైరెక్టర్ బొడ్డు లెనిన్, గ్రామశాఖ అధ్యక్షులు జాలిగాపు దుర్గయ్య, కొత్తపెల్లి బిక్షపతి, సారజీ కుమార్, సురేష్, మండల ఉపాధ్యక్షులు వక్కల రవి, మండల మహిళా అధ్యక్షురాలు ఠాకూర్ ఉమా, అంకం రాజకుమారి, యామిని, కొంతం కొమురమ్మ, గ్రామ యూత్ అధ్యక్షులు కొలిపాక గణేష్, మండల యూత్ ఉపాధ్యక్షులు గంగారపు శ్యామ్, యూత్ నాయకులు గాజే వెంకటేష్, పాపి రెడ్డి, రావుల భూపాల్ రెడ్డి, రావుల వేణు మహేందర్ రెడ్డి,మేకల రాజయ్య, బాపు రెడ్డి,నాగవెల్లి ప్రశాంత్, జానకిపురం ప్రశాంత్ పాల్గొన్నారు.
-----------------------
Admin