సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : తెలంగాణ బి ఎస్ పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాలమేరకు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం బి ఎస్ పి అసెంబ్లీ ఇంచార్జి గా వడ్డే మల్లేష్ ను నియమించిన పార్టీ జిల్లా అధ్యక్షులు స్క్వేరో లింగం మరియు దొడ్డి శ్రీనివాస్. ఈ సందర్బంగా షాద్ నగర్ లోని బి ఎస్ ఆర్ పార్టీ కార్యాలయం లో వడ్డే మల్లేష్ అధ్యర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. దేశం లోని ఏ పార్టీ కూడా అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం లో ఉన్న హక్కులను అమలు చేయడం లేదని అన్నారు. దేశం లో 53 శాతం ఉన్న ఎస్ సి, ఎస్ టీ, బి సి, మైనారిటీ లను అన్ని పార్టీలు మోసం చేస్తున్నాయని అన్నారు. బహుజనులకు 60 నుండి 70 సీట్లు ఇవ్వడానికి మేము సిద్దంగా ఉన్నామని తెలిపారు. ఈ సందర్బంగా నియోజకవర్గం అసెంబ్లీ ఇంచార్జి గా ఎన్నికైన వడ్డే మల్లేష్ మాట్లాడుతూ.. ఇంతకుముందు బహుజన రాజ్యం పార్టీ లో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నేను బి ఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ బడుగు బలహీన వర్గాల కొరకు చేస్తున్న పోరాటాలకు ఆకర్షతుడినై ఈ పార్టీ లో చేరడమైనది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలుపుతూ నియోజకవర్గం లోని అన్ని మండలాలు, గ్రామాలలో తిరిగి బి ఎస్ పి పార్టీ చేస్తున్న ప్రణాళిక లను తెలియజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లో బి ఎస్ పి జిల్లా కోశాధికారి రాంప్రసాద్ గౌడ్, జిల్లా ఇంచార్జి గుండేటి మహేష్ చారి, నియోజకవర్గం ఇంచార్జి లు గుండేటి నర్సిములు, ప్రశాంత్ ముదిరాజ్, మున్సిపాలిటీ అధ్యక్షుడు మోజెస్, కొందుర్గు మండలం అధ్యక్షుడు దుర్గం శ్రీనివాస్, భానురి చెంద్రయ్య, సీనియర్ నాయకులు పొట్ట నర్సింలు, ఫరూఖ్ నగర్ మండలం అధ్యక్షుడు తుప్పరి కుమార్, అసెంబ్లీ కన్వినర్ దర్శన్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin