Friday, 31 July 2026 11:48:05 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తాళం వేసి ఉన్న ఇండ్లల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్

Date : 19 December 2025 06:40 PM Views : 258

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : కెయూసి పోలీస్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తాళం వేసి వున్న ఇండ్లల్లో చోరీకి పాల్పడుతున్న నిందితుడిని కెయూసి, సిసిఎస్‌ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేసారు.అరెస్టు చేసిన నిందితుడి నుండి పోలీసులు సూమారు ఐదు లక్షల విలువ గల 40 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి సెంట్రల్‌ జోన్‌ డీసీపీ దార కవిత వివరాలను వెల్లడిస్తూ ఆసిఫాబాద్‌ జిల్లా తాండుర్‌ మండలం, రేచిని గ్రామం, ప్రస్తుతం హనుమకొండ పరిధిలో నివాసం వుంటున్న సబ్బాని రంజిత్‌ (24), తాండూర్‌ ప్రాంతంలో భవన నిర్మాణ కార్మికుడి పనిచేస్తూ వచ్చిన డబ్బుతో మద్యం సేవిస్తూ జల్సాలకు చేయడంతో తనకు వచ్చే ఆదాయం తన జల్సాలకు సరిపోకపోవడంతో నిందితుడు సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఇందు కోసం నిందితుడు 2020 సంవత్సరంలో మంచిర్యాల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోరీకి పాల్పడటంతో నిందితుడుని పోలీసులు అరెస్టు చేసిన జైలుకు తరలించారు. జైలు నుండి విడుదలైన నిందితుడు తమ కుటుంబంతో కల్సి గత మూడు సంవత్సరాలు కెయూసి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ నివాసం వుంటున్నాడు. ఈ నెల 12వ తారీఖున నిందితుడు నివాసం వుంటున్న పరిసరాల్లో నివాసం వుంటున్న దంపతులు ఇంటికి తాళం వేసి సినిమాకి పోయినట్లుగా గుర్తించిన నిందితుడు ఎవరికి అనుమానం రాకుండా నిందితుడు ఆ ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని 40గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు 40వేల రూపాయల నగదు, ఒక సెలఫోన్‌ చోరీ చేసి అక్కడి నుండి తప్పించుకొని పారిపోయాడు. తమ ఇంటిలో దొంగలు పడినట్లుగా గుర్తించిన బాధితులు తమ ఫిర్యాదులు మాత్రం ఇంటిలో 250 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ జరిగినట్లుగా ఫిర్యాదు ఇవ్వడంతో వేగంగా పోలీసులు క్రైమ్స్‌ అదనపు డిసిపి బాలస్వామి ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టారు. పోలీసులకు అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకోని నిందితుడి కదలికలపై నిఘా పెట్టారు. ఈ రోజు ఉదయం కెయూసి, సిసిఎస్‌ పోలీసులు సంయుక్తంగా కలసి కెయూ జంక్షన్‌లో తనిఖీలు నిర్వహిస్తుండగా ఇదే ప్రాంతంలో అనుమానస్పదంగా తిరుగుతున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోని తనిఖీ చేయగా తాను చోరీ చేసిన బంగారు గాజులు గుర్తించిన పోలీసులు నిందితుడుని విచారించగా తాను చోరీ చేసిన ఇంటిలో కేవలం నాలుగు బంగారు గాజులు, 40 వేల రూపాయల నగదు, ఒక సెల్‌ఫోన్‌ మాత్రమే చోరీ చేసినట్లుగా పోలీసుల ఎదుట అంగీకరించాడు. దీనితో బాధితుల ఇంటిలో కేవలం 40 గ్రాముల బంగారు ఆభరణాలు మాత్రమే చోరీ జరిగినట్లు గుర్తించిన పోలీసులు బాధితుల ఇంటిలో మరో మారు తనీఖీ చేయగా చోరీ అయింది అనుకుంన్నా మిగితా బంగారు ఆభరణాలు బాధితుల ఇంటిలోనే లభ్యం కావడం జరిగింది.ఈ చోరీ సంఘటన సంబంధించి సెంట్రల్‌ జోన్‌ డిసిపి మాట్లాడుతూ ఇకపై ఎవరైన బాధితులు ఎవరైన చోరీ గురైన సొమ్ము ఎక్కువ మొత్తంలో చోరీ జరిగినట్లు ఫిర్యాదు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొవడం జరుగుతుందని డిసిపి ప్రజలకు సూచించారు. నిందితుడుని పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన సిసిఎస్‌, కెయూసి ఇన్స్‌స్పెక్టర్లు రాఘవేందర్‌, రవికుమార్‌, ఫింగర్‌ ప్రింట్‌ విభాగం ఇన్స్‌స్పెక్టర్‌ దేవేందర్‌, కెయూసి ఎస్‌.ఐ శ్రీకాంత్‌, కిరణ్‌, ఏఏఓ సల్మాన్‌పాషా, హెడ్‌ కానిస్టేబుళ్ళు మహేశ్వర్‌, జంపయ్య, కానిస్టేబుళ్ళు మధుకర్‌, చంద్రశేకర్‌, వంశీ, విశ్వేశ్వర్‌, ఐటీ కోర్ కానిస్టేబుళ్ళు నగేష్, ప్రవీణ్ లను సెంట్రల్‌ జోన్‌ డిసిపి అభినందనలు తెలియజేసారు.

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: