సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నేరేడు చర్ల భారతీయ జనతా పార్టీ నేరేడుచర్ల కార్యాలయంలో పట్టణ మండల పార్టీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు పార్తనబోయిన విజయ్ కుమార్ మాట్లాడుతూ దేశాన్ని సంఘటితం చేసేందుకు భారత మాతను పూజించాలని పిలుపు నిచ్చి, స్వామి వివేకానందుల వారు సాంస్కృతిక జాతీయవాదానికి బలమైన పునాది వేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి కోనతం నాగిరెడ్డి, ఉపాధ్యక్షులు జూలూరి అశోక్, పుల్లెంల సతీష్, గుమ్మడవెల్లి నిఖిల్, నాగయ్య, శంకర్ రెడ్డి, కటికం వినోద్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin