Friday, 31 July 2026 04:50:51 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు... - సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య

Date : 01 September 2023 06:40 AM Views : 257

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ఏజెన్సీ ప్రాంతాల్లో కులంతో నిమిత్తం లేకుండా స్థలం ఉన్న ప్రతి ఒక్కరికీ గృహలక్ష్మి పథకం అమలు చేయాలి... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 1నుండి 7 వరకు జరిగే ఆందోళనలను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య పిలుపునిచ్చారు. ఆన్లైన్ లో జరిగిన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో రోజు రోజుకు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులపై విపరీతమైన భారాలు మోపబడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2014 నుండి ఇప్పటివరకు నిత్యావసరాల ధరలు 200 శాతం పెరిగాయని, ఈ నెలలోనే కూరగాయల ధరలు 37 శాతం పెరిగాయని,మోడీ ప్రభుత్వం విధానాలు పెట్టుబడి దారులకు రాయితీలు,సామాన్యులకు భారాలు అనే పద్ధతిలో ఉన్నాయని ఆయన విమర్శించారు.ప్రజల బాధలు తీర్చే ఆలోచనలు చేయకుండా మోడీ ప్రభుత్వం దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజా సమస్యలు పక్క దారి పట్టిస్తున్నారని, విదేశాలకు వెళ్ళడానికి తీరిక దొరికినా ప్రధానికి స్వదేశంలో ఒక రాష్ట్రం రావణ కాష్టం గా మారితే మణిపూర్ కి వెళ్ళే తీరిక లేదని ఆయన ఎద్దేవా చేశారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గృహ లక్ష్మి ,దళిత బందు పథకాలు తెరాస కార్యకర్తల పథకాలుగా మారాయని,ఎమ్మెల్యే ల జోక్యంతో వారి కార్యకర్తలకు మాత్రమే ఈ పథకాలు వర్తింప చేస్తున్నారని ఆయన ఆరోపించారు.దళిత బంధు అమలులో రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన వారికి అమలు చేయకపోతే లబ్ధిదారుల తరుపున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఏజెన్సీ ప్రాంతంలో 1970 కి ముందు ఉన్నవారికే గృహలక్ష్మి పథకం వర్తింప చేయడం అంటే ఇతర కులాల వారికి పథకం వర్తింప చేయకుండా ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, కులం, 1970 నిబంధన తో సంబందం లేకుండా స్థలం ఉన్న ప్రతి ఒక్కరికీ గృహలక్ష్మి పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పైన పేర్కొన్న సమస్యలపై జిల్లాలో గ్రామ స్థాయిలో పోరాటాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 10 నుండి 17 వరకు జరిగే వీర తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను జయప్రదం చేయాలని పిలుపుిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, ఏజే రమేష్, కొక్కెరపాటి పుల్లయ్య, యం.జ్యోతి,ఎంబి నర్సారెడ్డి, కారం పుల్లయ్య, బ్రహ్మచారి, లిక్కి బాలరాజు,జిల్లా కమిటీ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ,కే ధర్మ,కొండపల్లి శ్రీధర్, నభి,అర్జున్, వంశీ,రమేష్ తదతరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: