సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : జాతీయ రహదారులకు భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన చేపట్టాలని చీఫ్ సెక్రటరీ డా.జవహర్ రెడ్డి ఆదేశించారు. విజయవాడ నుంచి గురువారం భూముల రీసర్వే, జాతీయ రహదారులకు సంబంధించి భూ సేకరణ, వ్యవసాయం, హౌసింగ్, స్పందన గ్రీవెన్స్ లు, తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చీఫ్ సెక్రటరీ డా.జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ టిఎస్.చేతన్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీఫ్ సెక్రటరీ డా.జవహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రాధాన్యతకనుగుణంగా జాతీయ రహదారులకు భూసేకరణ ప్రక్రియ వేగంగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిత్యం ప్రాజెక్టుల వారీగా సమీక్ష నిర్వహించి భూసేకరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం కింద చేపట్టిన రీసర్వేలో భాగంగా డ్రోన్ సర్వే, గ్రౌండ్ వాలిడేషన్, తదితర పనులన్నీ సకాలంలో చేపట్టేలా చూడాలన్నారు. రీ సర్వేని పకడ్బందీగా చేపట్టాలన్నారు. మొదటి, రెండవ దశలలో చేపట్టిన పనుల ప్రగతిలపై సమీక్షించారు. గ్రౌండ్ టు థింగ్, డ్రోన్ సర్వే, మ్యుటేషన్స్ తదితర అంశాలలో కేటాయించిన లక్ష్యాలను గడువులోగా చేరుకోవాలన్నారు. రబీ ఈక్రాప్ బుకింగ్ గడువులోగా పూర్తి చేయాలన్నారు. వైఎస్సార్ యంత్ర సేవా పథకం గ్రౌండింగ్ వేగవంతం చేయాలన్నారు. రైతులకు చిరుధాన్యాలపై అవగాహన కల్పించి వాటి సాగును ప్రోత్సహించేలా సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచాలన్నారు. బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ ల నిర్మాణాలు త్వరగా పూర్తి కావాలన్నారు. ఇళ్ల నిర్మాణాల పూర్తిపై అధికారుల ప్రత్యేక శ్రద్ధ పెట్టి స్టేజ్ కన్వర్షన్ మీద దృష్టి పెట్టాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సిపిఓ విజయ్ కుమార్, పీఆర్ ఎస్ఈ గోపాల్ రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు, హౌసింగ్ పిడి చంద్రమౌళి రెడ్డి, పట్టుపరిశ్రమ శాఖ జెడి పద్మమ్మ, డిఆర్డీఏ పిడి నరసయ్య, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రషీద్ ఖాన్, సర్వే ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి రామకృష్ణ, డిపిఓ విజయ్ కుమార్ రెడ్డి, ఉద్యాన శాఖ డిడి చంద్రశేఖర్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ డిడి సుభదాస్, డిఈఓ మీనాక్షి, అహుడా అధికారి చిన్నయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్న....
-----------------------
Admin